‘సరిలేరు నీకెవ్వరు’లో 'వెంకీ' టైప్ ట్రైన్ ఎపిసోడ్

By Prashanth MFirst Published Jun 9, 2019, 12:55 PM IST
Highlights

మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి  దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.ఎం.బి  ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ  నటి విజయశాంతి ఈ చిత్రంతో సినిమా రంగంలోకి రీలాంచ్ అవటం విశేషం.

మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి  దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.ఎం.బి  ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ  నటి విజయశాంతి ఈ చిత్రంతో సినిమా రంగంలోకి రీలాంచ్ అవటం విశేషం. రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు నిర్మిస్తున్నారు.  రీసెంట్ గా హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైందీ చిత్రం.  ఇక ఈ చిత్రంలో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

ఫిల్మ్ నరగ్ వర్గాలనుంచి అందుతన్న సమాచారం మేరకు ఆర్మీ మేజర్ అయిన మహేష్ తన విలేజ్ కు బయిలుదేరి వస్తూండగా ట్రైన్ లో పరిచయం అయ్యే రష్మిక మందన్నతో పరిచయం, ప్రేమ సాగుతుంది. ఆ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందిట. రవితేజ వెంకీలో ట్రైన్ ఎపిసోడ్ మాదిరిగా పూర్తి ఫన్ తో సాగుతుందని చెప్తున్నారు. 

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబు నాకు గొప్ప అవకాశాన్నిచ్చారు. మంచి విజయాన్ని అందివ్వడం ద్వారా ఆయన రుణం తీర్చుకుంటాను. మహేష్‌బాబు ఆర్మీ మేజర్‌ పాత్రలో నటిస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత నటి విజయశాంతి ఈ సినిమాతో మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ల తర్వాత మళ్లీ మహేష్‌ - దేవిశ్రీప్రసాద్‌ కలిసి పనిచేస్తున్నారు’’ అన్నారు.

నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబు  హీరోగా నటిస్తున్న 26వ సినిమా ఇది.  మహేష్‌ అభిమానుల్ని ఆనందపరిచే రీతిలో అనిల్‌  రావిపూడి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు  తీసుకొస్తామ’’న్నారు. 

దిల్‌ రాజు మాట్లాడుతూ  ‘‘ ఈ సినిమాని నేను, అనిల్‌ సుంకరగారి ఎ.కె.ఎంటర్‌ టైన్‌మెంట్స్‌, మహేష్‌బాబుగారి జీఎంబీ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నాం. 2020 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల  చేస్తున్నామని ముందే అనిల్‌ రావిపూడి చెప్పాడు.20-20 క్రికెట్‌ మ్యాచ్‌ల తరహాలో సంక్రాంతికి వినోదాన్ని పంచడానికి అనిల్‌ రావిపూడి సిద్ధమయ్యార’’అన్నారు. 

click me!