ఫ్లాప్ దర్శకుడితో మహేష్ మేనల్లుడు!

Published : Jun 09, 2019, 12:31 PM ISTUpdated : Nov 07, 2019, 10:56 AM IST
ఫ్లాప్ దర్శకుడితో మహేష్ మేనల్లుడు!

సారాంశం

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైన సంగతి తెలిసిందే.  నటనలో కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకొని వెండి తెరకు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సమయంలో ఊహించని విధంగా మొదటి సినిమా ఆదిలోనే ఆగిపోయింది. 

దిల్ రాజు ప్రొడక్షన్ లో మొదలైన ఆ సినిమా ఆ అనుకోని విధంగా అటకెక్కింది. అయితే ఇప్పుడు గల్లా అశోక్ ఒక ప్లాప్ అందుకున్న దర్శకుడితో సినిమాకు సిద్దమైనట్లు సమాచారం. నాని - నాగార్జున లతో దేవదాస్ అనే సినిమా చేసి అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన శ్రీరామ్ ఆదిత్య నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నాడు. 

ఈ క్రమంలో అశోక గల్లా స్క్రిప్ట్ ను నచ్చి అతనితో వర్క్ చేయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జులైలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయాలనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?