మహేష్ కు మరో శ్రీను వైట్ల దొరికినట్లే!

Published : Feb 22, 2019, 02:10 PM IST
మహేష్ కు మరో శ్రీను వైట్ల దొరికినట్లే!

సారాంశం

ఆ మధ్యకాలంలో వరస పెట్టి కామెడీలు తీసి హిట్ కొట్టాడు శ్రీను వైట్ల.  ఆ తర్వాత వరస డిజాస్టర్స్ వచ్చి వెనక బడ్డాడు కానీ ఆయన చేసిన సినిమాల్లో సీన్స్ ను ఇప్పటికి అభిమానలు చూసి పడి పడీ నవ్వుకుంటారు. 

ఆ మధ్యకాలంలో వరస పెట్టి కామెడీలు తీసి హిట్ కొట్టాడు శ్రీను వైట్ల.  ఆ తర్వాత వరస డిజాస్టర్స్ వచ్చి వెనక బడ్డాడు కానీ ఆయన చేసిన సినిమాల్లో సీన్స్ ను ఇప్పటికి అభిమానలు చూసి పడి పడీ నవ్వుకుంటారు. ఇప్పుడు ఆ స్లాట్ లో మరో కామెడీ దర్శకుడు అనీల్ రావిపూడి వచ్చి చేరారు. శ్రీను వైట్ల అప్పట్లో మహేష్ తో దూకుడు చేసినట్లే ఇప్పుడు అనీల్ రావిపూడి సైతం మహేష్ తో యాక్షన్ కామెడీ చేయటానికి రంగం సిద్దం చేసుకున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన  ఈ ప్రాజెక్టు...ఎఫ్ 2 హిట్ కొట్టడంతో ఈ సినిమా స్థానంలో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ సెట్ అయింది. సుకుమార్ చెప్పిన కథ ..పూర్తి స్క్రిప్టు గా రెడీ అయ్యి తెరకెక్కటానికి టైమ్ పట్టేటట్లు ఉందని, అనీల్ రావిపూడి కథ విని ఓకే చేసారట.

అందులోనూ దూకుడు తర్వాత సరైన కామెడీ ఎంటర్టైనర్ తను చేయలేదని, ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని భావిస్తున్నారట. దానికి తోడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ  చేయడంలోనూ.. షూటింగ్ మొదలెట్టాక గ్యాప్ లేకుండా... సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలోనూ  స్పీడు అని అందరికి అర్దమైంది. 

దాంతో  ఈ సినిమాను మార్చ్ లో లాంచ్ చేసి మే నుండి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?