హెల్మెట్‌ కోసం మహేష్‌.. స్పోర్ట్స్ మీట్‌ కోసం రామ్‌చరణ్‌..

Published : Feb 02, 2021, 01:10 PM IST
హెల్మెట్‌ కోసం మహేష్‌.. స్పోర్ట్స్ మీట్‌ కోసం రామ్‌చరణ్‌..

సారాంశం

సామాజిక కార్యక్రమాల కోసం మహేష్‌, రామ్‌చరణ్‌ కదిలారు. ఒకరు హెల్మెట్‌ పెట్టుకుంటే, మరొకరు గెస్ట్ గా వెళ్తున్నారు. సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ ధరించాలని చెబుతున్నారు మహేష్‌. ఈ మేరకు ఆయన హెల్మెట్‌ ధరించి బైక్‌పై ప్రయాణం చేస్తున్న ఫోటోని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌లు ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

సామాజిక కార్యక్రమాల కోసం మహేష్‌, రామ్‌చరణ్‌ కదిలారు. ఒకరు హెల్మెట్‌ పెట్టుకుంటే, మరొకరు గెస్ట్ గా వెళ్తున్నారు. సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ ధరించాలని చెబుతున్నారు మహేష్‌. ఈ మేరకు ఆయన హెల్మెట్‌ ధరించి బైక్‌పై ప్రయాణం చేస్తున్న ఫోటోని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌లు ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. `మీకు, మీ ఫ్యామిలీ సేఫిటీ కోసం హెల్మెట్‌ ధరించండి` అని పేర్కొన్నారు. 

మరోవైపు సైబరాబాద్‌ పోలీసుల కోసం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కదిలారు. `3వ ఆన్వల్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌` ఈవెంట్‌ కోసం ఆయన గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. నేడు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు  గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్‌లో జరిగే ఈ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. మరోవైపు గౌరవ అతిథిగా ఉపాసన కూడా పాల్గొననున్నారు. 

ప్రస్తుతం మహేష్‌ `సర్కారువారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇటీవల దుబాయ్‌లో షూటింగ్‌ ప్రారంభమైంది. మరోవైపు రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్