రాముడిగా మహేష్‌, హనుమాన్‌గా అల్లు అర్జున్‌, రావణుడిగా హృతిక్‌..?

Published : Feb 11, 2021, 07:51 AM IST
రాముడిగా మహేష్‌, హనుమాన్‌గా అల్లు అర్జున్‌, రావణుడిగా హృతిక్‌..?

సారాంశం

ప్రభాస్‌ హీరోగా `ఆదిపురుష్‌` ప్రకటించగానే ఈ `రామాయణ్‌` ప్రాజెక్ట్ పై సస్పెన్స్ నెలకొంది. కానీ ఇటీవల మళ్లీ దీన్ని ట్రాక్‌లోకి తీసుకొచ్చారు దర్శక, నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ చేశారని తెలుస్తుంది. కాస్టింగ్‌పై ఫోకస్‌ పెట్టారట. ఇందులో రాముడిగా మహేష్‌బాబుని అనుకుంటున్నట్టు సమాచారం.

ప్రస్తుతం `రామాయణం`పై సినిమాలొస్తున్నాయి. ప్రభాస్‌ హీరోగా హిందీలో `ఆదిపురుష్‌` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ తెరకెక్కనుంది. మరోవైపు తెలుగు బేస్డ్ గా నిర్మాత అల్లు అరవింద్‌ ఓ `రామాయణ్‌` చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు రెండేళ్ల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ప్రభాస్‌ హీరోగా `ఆదిపురుష్‌` ప్రకటించగానే ఈ `రామాయణ్‌` ప్రాజెక్ట్ పై సస్పెన్స్ నెలకొంది. కానీ ఇటీవల మళ్లీ దీన్ని ట్రాక్‌లోకి తీసుకొచ్చారు దర్శక, నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ చేశారని తెలుస్తుంది. కాస్టింగ్‌పై ఫోకస్‌ పెట్టారట. ఇందులో రాముడిగా మహేష్‌బాబుని అనుకుంటున్నట్టు సమాచారం. అలాగే రావణుడిగా హృతిక్‌ రోషన్‌ని దాదాపుగా ఖరారు చేశారని టాక్‌. అలాగే సీత పాత్రలో దీపికా పదుకొనె పేరు వినిపిస్తుంది. ముందుగా నయనతార, అనుష్క పేర్లు తెరపైకి వచ్చినా, దీపికాకి నార్త్ లో మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం. 

ఇదిలా ఉంటే ఇందులో మరో ఆసక్తికర విషయం వినిపిస్తుంది. హనుమంతుడు లేని రామాయణం ఊహించుకోలేం. రాముడు, రావణుడు ఎంత ముఖ్యమో, అంతకంటే ఎక్కువగా హనుమంతుడి పాత్ర ఉంటుంది. ఆ పాత్రకి అల్లు అర్జున్‌ ని అనుకుంటున్నారని టాక్‌. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. కానీ ఈ కాంబినేషన్‌ మాత్రం అదిరిపోయేలా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. ఇదే సెట్‌ అయితే, ప్రస్తుతానికి దీన్ని మించిన ఇండియన్‌ సినిమా లేదనేది నిజం. ఈ చిత్రానికి `మామ్‌` ఫేమ్‌ రవి ఉద్యవార్‌, `దంగల్‌` ఫేమ్‌ నితీష్‌ తివారీ దర్శకత్వం వహిస్తారు. త్రీడీగా మూడు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కించేందుకు నిర్మాతలు `అల్లు అరవింద్‌, మధుమంతెన, నమిత్‌ మల్హోత్రా ప్లాన్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది