లైవ్ చాట్ లో రేణుదేశాయ్.. ఆడుకున్న అభిమానులు!

Published : May 02, 2019, 02:45 PM IST
లైవ్ చాట్ లో రేణుదేశాయ్.. ఆడుకున్న అభిమానులు!

సారాంశం

పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్నప్పటికీ రేణుదేశాయ్ కి తన గతం తాలుకు నీడలు తొలగిపోవడం లేదు. 

పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్నప్పటికీ రేణుదేశాయ్ కి తన గతం తాలుకు నీడలు తొలగిపోవడం లేదు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని మరింత ఆసక్తి కనబరుస్తున్నారు నెటిజన్లు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుని అభిమానులు ఎప్పటికప్పుడు తనకు కాబోయే భర్త గురించి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా రేణు అభిమానులతో లైవ్ చాట్ చేసింది. తన వ్యక్తిగత విషయాలు అడగొద్దని చెప్పినా.. నెటిజన్లు అవే ప్రశ్నలు అడగడం గమనార్హం.

అందులోనూ తనకు కాబోయే భర్త గురించి పదే పదే అడగడంతో సంయమనం కోల్పోయిన రేణు సెలబ్రిటీలు కూడా మనుషులే అని వాళ్లకు కూడా విడిగా జీవితం ఉంటుందని.. అది గుర్తించాలని కోరింది. ఇలా ఇష్టం లేని ప్రశ్నలతో అదేపనిగా విసిగించడంలో ఆంతర్యమేంటో అంటూ క్లాస్ పీకింది. సోషల్ మీడియాలో తన తమ్ముడి పెళ్లిలో దిగిన ఫోటోలను కొందరు పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారని తమ్ముడిని పట్టుకొని కాబోయే భర్త అంటూ కామెంట్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది రేణుదేశాయ్.

ఆ వార్తలు విని చాలా ఇరిటేట్ అయినట్లు చెప్పుకొచ్చింది. మొత్తానికి లైవ్ చాట్ లోకి వచ్చిన రేణుతో అభిమానులు ఓ రేంజ్ లో ఆడుకున్నారనే చెప్పాలి. ఆమె కూడా తన సహనం కోల్పోయి వారిపై విరుచుకుపడింది. 
 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు