కొన్ని తరాలను స్ఫూర్తి ప్రదాత మిల్కాసింగ్‌.. పరుగుల వీరుడికి చిరు, మహేష్‌, మోహన్‌లాల్‌ సంతాపం

By Aithagoni RajuFirst Published Jun 19, 2021, 2:11 PM IST
Highlights

 నెల రోజులుగా కరోనాతో పోరాడుతూ కోలుకున్న అనంతరం దాని సంబంధిత సమస్యలతో మిల్కా సింగ్ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల  చిరంజీవి, మహేష్‌లు కూడా సంతాపం ప్రకటించారు.

పరుగుల వీరుడు, లెజెండరీ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ అస్తమయం క్రీడాభిమానులనే కాదు, యావత్‌ భారతీయులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. `ఫ్లైయింగ్‌ సిఖ్‌‌`గా పాపులర్‌ అయిన ఆయన మరణం స్పోర్ట్స్ రంగానికి తీరని లోటని చెప్పొచ్చు.  నెల రోజులుగా కరోనాతో పోరాడుతూ కోలుకున్న అనంతరం దాని సంబంధిత సమస్యలతో మిల్కా సింగ్ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. 

ఆయన మృతి పట్ల రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా చిరంజీవి, మహేష్‌లు కూడా సంతాపం ప్రకటించారు. `పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్టని, భారత పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన భరతమాత ముద్దుబిడ్డ మిల్కా సింగ్‌. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్‌కి నివాళి` అని ట్విట్టర్‌ ద్వారా సంతాపం ప్రకటించారు చిరంజీవి. 

పరుగుల వీరుడు
మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్ట ను, భారత పతాకాన్ని అంతర్జాతీయస్థాయి లో రెపరెప లాడించిన భరతమాత ముద్దబిడ్డ మిల్కా సింగ్.
ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్ కు నివాళి🙏

— Chiranjeevi Konidela (@KChiruTweets)

మరోవైపు సూపర్‌ స్టార్‌ మహేష్‌ సైతం మిల్కా సింగ్‌ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. `స్పోర్ట్స్ లెజెండ్‌ మిల్కా సింగ్‌ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మన దేశానికి గొప్ప నష్టం. అతని అద్భుతమైన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది` అని చెప్పారు మహేష్‌. మోహన్‌లాల్‌ కూడా సంతాపం ప్రకటించారు.

Deeply saddened by the passing away of sports legend . A monumental loss for our nation.. His incredible legacy will continue to inspire athletes all the over the world. Rest in peace sir. 🙏

— Mahesh Babu (@urstrulyMahesh)

A great athlete and a great human. Milkha Singhji, you were an inspiration to many! Rest in Peace 🙏 pic.twitter.com/NgL7b5twEV

— Mohanlal (@Mohanlal)
click me!