మహర్షితో జాగ్రత్త నిఖిల్?

Published : May 01, 2019, 03:23 PM IST
మహర్షితో జాగ్రత్త నిఖిల్?

సారాంశం

సమ్మర్ లో ఎండల జోరు ఎంత ఉన్నా కూడా సినీ లవర్స్ అస్సలు లెక్కచేయడం లేదు. సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ మంచి సినిమాలపై ఓ లుక్కేస్తున్నారు.

సమ్మర్ లో ఎండల జోరు ఎంత ఉన్నా కూడా సినీ లవర్స్ అస్సలు లెక్కచేయడం లేదు. సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ మంచి సినిమాలపై ఓ లుక్కేస్తున్నారు. మజిలీ - జెర్సీ - కాంచన 3 సినిమాలు జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అయితే మే 9న మహేష్ 25వ చిత్రం మహర్షి కూడా రిలీజ్ కానుంది. 

బజ్ అంతగా లేకపోయినా మహేష్ సినిమా కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా హిట్టవ్వడం పక్కా. సమ్మర్ మొత్తాన్ని సూపర్ స్టార్ ఆక్రమిస్తాడని చెప్పవచ్చు. అయితే ఆ సమయంలో నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అసలైతే మే1న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ సర్దుబాటు కాకపోవడంతో రిలీజ్ కాలేదు. 

ఇక ఫైనల్ గా మే17న సేఫ్ జోన్ లో దిగాలని నిఖిల్ ట్రై చేస్తున్నాడు. అప్పటివరకు మహర్షి హంగామా కొనసాగితే రిస్క్ అనే చెప్పాలి. అర్జున్ సురవరం కనితన్ రీమేక్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాపై అంతగా అంచనాలేమి లేవు. సమ్మర్ పోటీలో మంచి టాక్ వస్తే తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేదు. మరి నిఖిల్ క్రేజ్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.   

PREV
click me!

Recommended Stories

Parasakthi: సంక్రాంతి ఫ్లాప్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందా.. రిలీజ్ డేట్ ఇదేనా ?
రాజమౌళి సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు.. హీరోకి తీవ్ర అవమానం, కానీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్