మహర్షి కలెక్షన్స్: పవన్ రికార్డ్ ను అందుకోలేకపోయిన మహేష్

By Prashanth MFirst Published May 10, 2019, 11:09 AM IST
Highlights

మహర్షి సినిమా ఈ సారి పాజిటివ్ బజ్ తో రిలీజయినప్పటికీ అజ్ఞాతవాసి రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయింది. 

అజ్ఞాతవాసి కి మినిమమ్ యావరేజ్ టాక్ వచ్చి ఉంటె ఏ రేంజ్ లో హిట్టయ్యేదో మొదటి రోజు కలెక్షన్స్ చుస్తే ఎవ్వరికైనా అర్ధమవుతుంది. కానీ మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో ఊహించని విధంగా కలెక్షన్స్ ను అందుకున్న ఆ సినిమా అదే స్థాయిలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే మహర్షి సినిమా ఈ సారి పాజిటివ్ బజ్ తో రిలీజయినప్పటికీ అజ్ఞాతవాసి రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయింది. 

పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ ను నమోదు చేసినప్పటికీ డే 1 లో మొత్తంగా ఏపీ - తెలంగాణ కలెక్షన్స్ ని చూసుకుంటే మహేష్ సినిమా అనుకున్నంతగా రాబట్టలేకపోయింది. అసలైతే సినిమా తెలుగు రాష్ట్రలో 30 కోట్ల షేర్స్ ను రాబడుతుందని టాక్ వచ్చింది.. కానీ 24.67 కోట్ల దగ్గర కలెక్షన్స్ ఆగిపోయియాయ్. 

అజ్ఞాతవాసి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 26.36 కోట్ల షేర్స్ ను రాబట్టింది. ఇక అరవింద సమేత 26.60 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్స్ లో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వినయవిధేయ రామ 26.03 కోట్లతో మూడవ స్థానంలో ఉంది. వీటి తరువాత మహేష్ మహర్షి 26.67కోట్లతో నాలుగవ స్థానాన్ని అందుకుంది. బాహుబలి 2 మొదటి రోజు ఏపీ తెలంగాణాలో 42.87 కోట్ల షేర్స్ ను అందించింది.    

బాక్స్ ఆఫీస్: మహర్షి నైజం సిక్సర్.. బాహుబలి 2 రికార్డ్ మిస్

నాన్ బాహుబలి రికార్డ్స్ తో మహర్షి హంగామా!

click me!