దిశా అపార్ట్మెంట్‌ నుంచి దూకిందా? తోయబడిందా? బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం

By Aithagoni RajuFirst Published Aug 10, 2020, 10:08 AM IST
Highlights

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అమిత్‌ దిశా కేసులో పలు ప్రశ్నలను లేవనెత్తాడు. డిఫ్యూటీ పోలీస్‌ కమిషనర్‌ విశాల్‌ ఠాకూర్‌కి ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఇందులో దిశా మరణానికి సంబంధించి ప్రధానంగా ఐదు ప్రశ్నలు అడిగారు.

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుతోపాటు ఆయన మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ ఆత్మహత్య కేసు కూడా ఇప్పుడు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది. సుశాంత్‌ ఆత్మహత్యకు ఐదు రోజుల ముందు ఆమె చనిపోయింది. ఆమె ఆత్మహత్యకి, సుశాంత్‌ ఆత్మహత్యకి సంబంధం ఏంటనేది ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. అపార్ట్ మెంట్‌ పై నుంచి ఆమె దూకి చనిపోయిందని అంటున్నారు. 

అయితే ఆమె ఆత్మహత్య కేసు సైతం ఇప్పుడు సరికొత్త ట్విస్టులతో సాగుతుంది. మరణించడానికి ముందు రోజు ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌, స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంది. ఎంతో సంతోషంగా ఆ పార్టీలో చిందులేసింది. అలాంటి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది? పైగా బాయ్‌ఫ్రెండ్‌ ఫ్లాట్‌లో జరిగిన పార్టీలో పాల్గొందంటున్నారు? అక్కడ సీసీ ఫూటేజ్‌ ఏం చెబుతుంది? ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు వెల్లడవుతున్నాయి. 

ఇదే విషయాన్ని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే లేవనెత్తాడు. అంధేరి ఎమ్మెల్యే అమిత్‌ సైతం ప్రశ్నలను లేవనెత్తాడు. డిఫ్యూటీ పోలీస్‌ కమిషనర్‌ విశాల్‌ ఠాకూర్‌కి ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఇందులో దిశా మరణానికి సంబంధించి ప్రధానంగా ఐదు ప్రశ్నలు అడిగారు. దిశా సలియన్‌ మరణం ఆత్మహత్యగా ప్రకటించబడింది. దీని వల్ల తాను ఐదు ప్రశ్నలు లేవనెత్తుతున్నానని తెలిపారు. 

ఆ ప్రశ్నలేంటో చూస్తే.. దిశా సలియన్‌ భనవం నుంచి కిందకి నెట్టబడిందా? లేక స్వయంగా ఆమే దూకిందా? సైట్‌ ఫోరెన్సిక్‌ రిపోర్ట్ ఏం చెబుతుంది? ఆ దిశగా దర్యాప్తు చేపట్టారా? ఈ ఘటన కచ్చితంగా ఏ సమయంలో జరిగింది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతోపాటు ఆమె మరణించడానికి ముందు ఆ పార్టీలో పాల్గొన్న మాట వాస్తవమేనా? అవును అయితే ఆ పార్టీలో పాల్గొనడానికి ముందు ఆమె ఎవరితో ఫోన్‌లో మాట్లాడారు. ఆమె ఫోన్‌ కాల్‌ డేటాలో 24గంటల ముందు ఎవరెవరితో మాట్లాడింది. ఏం మాట్లాడింది. అసలు ఆమె ఫోన్‌ని తనిఖీ చేశారా? అని అడిగారు. 

ఇంకా ప్రశ్నిస్తూ, దిశా చివరగా ఎవరిని కలుసుకుంది. అందరు ఫ్లాట్‌కి వెళ్ళారనుకుంటే ఎవరెవరు వెళ్ళారు అనేది సీసీ టీవీలో రికార్డ్ అయి ఉంటుంది. అందులో ఎవరున్నారు. ఆ సీసీ టీవీ ఫూటేజ్‌ తనిఖీ చేశారా? అంటూ ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు. ఆమె మరణించిన సమయంలో, చుట్టుపక్కల ఉన్న సైట్‌లో వాస్తవాలను తెలుసుకునేందుకు సెక్యూరిటీ గార్డ్ ని, చుట్టుపక్కల వారిని విచారించారా? అపార్ట్ మెంట్‌పై నుంచి దూకాక ఆమె రక్షించబడిందని అంటున్నారు. నిజంగానే ఆ చర్య జరిగిందా? ఎవరెవరు రక్షించేందుకు ప్రయత్నించారు?` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు బీజేపీ ఎమ్మెల్యే. వారం రోజుల్లోగా తమకు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని తెలిపారు. 

ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు ఈ కేసుల్లో మరో ట్విస్టులను రివీల్‌ చేస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు గతంలో పోలీసులు వెల్లడించలేదు. మరి ఈ కోణంలో విచారిస్తే మరిన్ని కొత్త విషయాలు బయటపడే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా అటు సుశాంత్‌ కేసు, ఇటు దిశా కేసు ఉత్కంఠతను గురి చేస్తున్నాయి. ఈ కేసుల్లో మున్ముందు ఇంకా ఎలాంటి కొత్త విషయాలు బయటపడతాయో చూడాలి. 

click me!