మంచు వారి ఇంట బర్త్ డే సందడి..కనువిందుగా ఫోటోషూట్‌!

Published : Aug 10, 2020, 09:09 AM IST
మంచు వారి ఇంట బర్త్ డే సందడి..కనువిందుగా ఫోటోషూట్‌!

సారాంశం

మంచు విష్ణు నాలుగో సంతానం అయిన ఐరా విద్యా పుట్టిన రోజుని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. వైరస్‌ కారణంగా తమ కుటుంబం వరకు ఈ సెలబ్రేషన్‌ పరిమితమైనా గ్రాండియర్‌ లుక్‌లో సాగింది. తాజాగా విడుదల చేసిన ఫోటో షూట్‌ ఫోటోలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. 

మంచు ఫ్యామిలీలో పుట్టిన రోజు వేడుకలు ఘనం జరిగాయి. మంచు విష్ణు నాలుగో సంతానం అయిన ఐరా విద్యా పుట్టిన రోజుని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. వైరస్‌ కారణంగా తమ కుటుంబం వరకు ఈ సెలబ్రేషన్‌ పరిమితమైనా గ్రాండియర్‌ లుక్‌లో సాగింది. తాజాగా విడుదల చేసిన ఫోటో షూట్‌ ఫోటోలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్‌, వారి సతీమణులు, మంచు లక్ష్మీ, వారి దగ్గరి బంధువులు మాత్రమే ఈ సెలబ్రేషన్‌లో  పాల్గొన్నారు. 

మంచు విష్ణు, విరోనికా దంపతులకు కుమార్తెలు అరియాన, వివియాన, కుమారుడు అవ్రామ్‌ భక్త సందడి చేశారు. ఐరా చిన్న కుమార్తె. దాదాపు వీరంతా ఒకే డ్రెస్‌ కోడ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. లేత గులాబీ థీమ్‌తో ఈ ఫోటో షూట్‌ నిర్వహించారు. మంచు మహిళలు కుర్చీల్లో కూర్చుని ఉండగా, మోహన్‌బాబు, విష్ణ, మనోజ్‌ వెనక నిల్చుని ఫోటోలకు పోజులిచ్చారు. దీంతోపాటు మంచు విష్ణు ఫ్యామిలీ దిగిన మిగిలిన ఫోటోస్‌ సైతం ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మంచు విష్ణు ఈ ఫోటోషూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకున్నారు. 

ప్రస్తుతం మంచు మనోజ్‌ `మోసగాళ్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కాజల్‌, సునీల్‌ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. దీంతోపాటు మంచు విష్ణు మరో రెండు ఇతర చిత్రాల్లో నటిస్తున్నారు. చాలా రోజులుగా హిట్‌ లేని విష్ణు ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. మరోవైపు ఆయన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ని లాంచ్‌ చేయాలని భావిస్తున్నారని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..