మహానుభావుడు ఫస్ట్ డే కలెక్షన్స్

Published : Sep 30, 2017, 11:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
మహానుభావుడు ఫస్ట్ డే కలెక్షన్స్

సారాంశం

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు ఫస్ట్ డే నాడు 3.8 కోట్ల రూపాయల షేర్ సాధించిన మహానుభావుడు జైలవకుశ, స్పైడర్ లతో గట్టి పోటీవున్నా మహానుభావుడు వసూళ్ల సంచలనం

శర్వానంద్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన మహానుభావుడు ఈ శుక్రవారం రిలీజై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. మహానుభావుడు సినిమాకు థియేటర్ల కొరత కారణంగా వసూళ్లపై దెబ్బ పడుతుందని భావించారు. కానీ తాజాగా ఫిలింనగర్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహానుభావుడు ఓపెనింగ్స్ శర్వానంద్ కెరీర్‌లోనే రికార్డుస్థాయిలో వున్నట్టు తెలుస్తోంది.

 

రిలీజైన తొలిరోజే మహానుభావుడు రూ.3.8 కోట్ల షేర్స్ రాబట్టినట్టు చెబుతున్న ట్రేడ్ వర్గాలు.. శర్వా కెరీర్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక మొత్తం అని స్పష్టంచేశాయి. స్పైడర్, జై లవ కుశ లాంటి భారీ ప్రాజెక్ట్స్ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని సైతం రిలీజైన రోజే ఏకంగా షేర్స్ రాబట్టిందంటే, మహానుభావుడు నిజంగా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నట్టేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

4 ఆటలతో 3 ఏళ్లు నాన్ స్టాప్ గా ఆడిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Spirit లో విజయ్‌ దేవరకొండ ? పాత్ర ఇదేనా.. వామ్మో బాక్సాఫీసు షేక్ అయ్యే మ్యాటర్‌