‘వకీల్‌సాబ్’ మొదట అనుకున్న టైటిల్‌ వేరు: వేణుశ్రీరామ్‌

By Surya PrakashFirst Published Mar 21, 2021, 2:50 PM IST
Highlights

పవన్ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’ కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. 

పవన్ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’ కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.  తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే అబిమానులు రింగ్ టోన్స్ గా మారిపోయాయి.  సినీ ప్రియులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్‌’ ప్రమోషన్‌లో చిత్ర దర్శకుడు వేణుశ్రీరామ్‌ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. 

వేణు శ్రీరామ్ మాట్లాడుతూ...‘‘ఈ కథ అనుకోగానే మొదట ‘మగువా’ అనే టైటిల్‌ అనుకున్నాం. ఆ తర్వాత పవర్‌స్టార్‌ని దృష్టిలో ఉంచుకుని ‘వకీల్‌సాబ్‌’ టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. ఇందులోని ‘మగువా’ పాటకు రామజోగయ్య అందించిన లిరిక్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయి. సాధారణమైన భాషలో ఈ పాట రాశారు. మొదట ఈ పాట వినగానే కన్నీళ్లు వచ్చేశాయి. నా మూడేళ్ల పాప కూడా ఈ పాట పాడుతుంది’’  అన్నారు.

అలాగే ‘‘పవన్‌కల్యాణ్‌ అంటే.. క్లాస్‌, మాస్‌, చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అందువల్లే ఆయన ఇమేజ్‌కి తగ్గట్టు సినిమాలో కొన్నింటిని చేర్చాల్సి వచ్చింది. ముఖ్య కథకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పాటలు సమకూర్చాం.’’ అని చెప్పుకొచ్చారు.
   
 నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవన్‌  కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. ’’ అన్నారు. ‘వకీల్‌సాబ్‌’ సెంకడ్‌ ఆఫ్‌లో ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఉందట. సినిమా విడుదలయ్యాక సర్‌ప్రైజ్‌ చూసి అందరూ ఆనందిస్తారట. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ , కెమెరా: పి.ఎస్‌. వినోద్, కో ప్రొడ్యూసర్‌: హర్షిత్‌ రెడ్డి.

click me!