రజినీకాంత్ కి హైకోర్టులో ఊరట!

By Udayavani DhuliFirst Published Dec 19, 2018, 11:37 AM IST
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ వియ్యంకుడు కస్తూరి రాజా.. ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా అనే వ్యక్తి వద్ద కొంత డబ్బుని తీసుకున్నారు. దానికోసం బాండ్ రాసిన ఆయన ఆ డబ్బు తానివ్వలేకపోతే రజినీకాంత్ ఇస్తారని అన్నారు. 

సూపర్ స్టార్ రజినీకాంత్ వియ్యంకుడు కస్తూరి రాజా.. ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా అనే వ్యక్తి వద్ద కొంత డబ్బుని తీసుకున్నారు. దానికోసం బాండ్ రాసిన ఆయన ఆ డబ్బు తానివ్వలేకపోతే రజినీకాంత్ ఇస్తారని అన్నారు. కస్తూరి రాజా డబ్బు ఇవ్వకపోవడంతో ముకుంద్ బోత్రా.. రజినీకాంత్ ని సంప్రదించాడు.

ఆ సందర్భంలో రజినీకాంత్ తన పేరుని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారని, ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దీంతో ముకుంద్ బోత్రా హైకోర్టుని సంప్రదించారు. కస్తూరి రాజా, రజినీకాంత్ కలిసి తనను మోసం చేశారని కోర్టులో ఆరోపించారు.

ఎట్టకేలకు ఈ విషయంలో రజినీకాంత్ కి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. రజినీకాంత్ పై చేసిన అభియోగాల్లో నిజం లేదని, ఆయనకి ఈ డబ్బు వ్యవహారంలో ఎలాంటి ఇవాల్వ్మెంట్ లేదని తేల్చి చెప్పింది కోర్టు. రజినీకాంత్ పై పెట్టిన కేసుని కొట్టిపారేసింది. 

2012లో ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రాతో కస్తూరి రాజాకు పరిచయం అయ్యింది. ఆ సమయంలోఇద్దరూ ఆర్థిక లావాదేవీలు చర్చించుకున్నారు.ఆ సమయంలోనే ముకుంద్ ''మైహున్ రజినీకాంత్'' అనే సినిమా నిర్మించడానికి సిద్ధమయ్యారు. రజినీకాంత్ పేరుతో సినిమా తీయడానికి అనుమతి ఇప్పించాల్సిందిగా ముకుంద్ కోరగా దానికి కస్తూరి రాజా రూ.40 లక్షల గుడ్ విల్ కోరారు. 

ఆ మొత్తం అందుకున్న తరువాత మరో పాతిక లక్షలు అవసరమని తీసుకున్నారు. తీరా రజినీకాంత్ తన పేరుతో సినిమా తీయడానికి వీలులేదని కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. దీంతో ముకుంద్ డబ్బు తిరిగివ్వమని కస్తూరి రాజాని కోరితే ఆయన ఇచ్చిన చెక్ లు బౌన్స్ అయ్యాయి. దీంతో కస్తూరి రాజా, రజినీకాంత్ లపై కేసులు పెట్టారు ముకుంద్. ప్రస్తుతానికి ఈ కేసు నుండి రజినీకాంత్ బయటపడినట్లే!

click me!