Mahesh with Balakrishna:నందమూరి-ఘట్టమనేని కుటుంబాల దశాబ్దాల వైరం... మహేష్ ని బాలయ్య అడుగుతాడా..!

Published : Dec 27, 2021, 08:08 AM ISTUpdated : Dec 27, 2021, 08:59 AM IST
Mahesh with Balakrishna:నందమూరి-ఘట్టమనేని కుటుంబాల దశాబ్దాల వైరం... మహేష్ ని బాలయ్య అడుగుతాడా..!

సారాంశం

బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో( Unstoppable) చివరి దశకు చేరుకుంది. మహేష్ ఎపిసోడ్ తో మొదటి సీజన్ ముగించనున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య-మహేష్ మధ్య ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయనే ఆసక్తి నెలకొని ఉంది.   

టాక్ షోకి సరికొత్త భాష్యం చెప్పారు బాలకృష్ణ (Balakrishna). హోస్ట్ గా ఆయన తెగువ ప్రేక్షకులకు బాగా నచ్చింది. సాధారణంగా టాక్ షోలలో వివాదాల జోలికి వెళ్లరు. సదరు సెలెబ్రిటీ గెస్ట్ కెరీర్, విజయాలతో పాటు ఎదురైన ఒడిదుడుకులు గురించి చర్చిస్తారు. బాలయ్య వాటితో పాటు వివాదాల గురించి కూడా ప్రస్తావన తేవడం ఈ షో ప్రత్యేకత. అన్ స్టాపబుల్  లో పాల్గొన్న గెస్ట్ గురించి ప్రచారమైన, అలాగే లైఫ్ లో జరిగిన కొన్ని మోస్ట్ కాంట్రవర్శీ టాపిక్స్ బాలకృష్ణ అడుగుతున్నారు. 

అదే సమయంలో తనతో, తన కుటుంబంతో గెస్ట్ కి సంబంధించి ఏదైనా ఓ పుకారు ప్రచారమైతే దానికి కూడా ఈ షో ద్వారా క్లారిటీ ఇస్తున్నారు.  ఇటీవల రవితేజ అతిధిగా రాగా... తనతో గొడవ గురించి రవితేజను అడిగారు. అలాగే డ్రగ్స్ కేసు గురించి రవితేజను అడిగి తెలుసుకున్నారు. రవితేజ మొదటిసారి తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. 

Also read NBK shock to Nagarjuna: నాగార్జునకి చెక్‌ పెట్టబోతున్న బాలకృష్ణ.. బిగ్‌బాస్‌ 6కి హోస్ట్ ఎవరంటే?

కాగా సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య చాలా గొడవలు జరిగాయి. అల్లూరి సీతారామరాజు మూవీ విషయంలో తలెత్తిన ఓ వివాదం దశాబ్దాల పాటు సాగింది. ఎన్టీఆర్ తన పలుకుబడితో కృష్ణను ఇబ్బందులకు గురిచేశారన్న వాదన ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని విమర్శిస్తూ కృష్ణ చిత్రాలు చేశారు. కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ స్పూప్ ఎపిసోడ్స్ తెరకెక్కించారు. కోటా శ్రీనివాసరావుతో చేసిన మండలాధీశుడు చిత్రం దానికి ఒక ఉదాహరణ. 

Also read Mahesh with Balakrishna: మహేష్ తో ముగించనున్న బాలకృష్ణ

ఎన్టీఆర్ సామాజికవర్గానికి చెందిన నటులు టీడీపీలో చేరి ఎంతో కొంత లబ్ధి పొందారు. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణ మాత్రం టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. దానికి కారణం ఎన్టీఆర్ తో ఆయనకున్న విబేధాలే. ఎన్టీఆర్ మరణించిన తర్వాత కూడా నందమూరి ఫ్యామిలీతో కృష్ణ సన్నిహితంగా ఉన్న దాఖలాలు లేవు. జూనియర్ ఎన్టీఆర్- మహేష్ (Mahesh babu)మాత్రం మంచి మిత్రులుగా ఉన్నారు. కాగా సీనియర్ ఎన్టీఆర్- కృష్ణ మధ్య నెలకొన్న వైరం ఆ తరంలో అందరికీ తెలిసిన నిజం. మరి ఈ విషయాన్ని బాలయ్య ప్రస్తావిస్తారా లేదా అనేది చూడాలి?

ఇక బాలకృష్ణ మరో టాక్ షోకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. హోస్ట్ గా ఆయన సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఓటిటి సంస్థలు, ఛానల్స్ ఆయనతో షోలు ప్లాన్ చేస్తున్నాయట. బిగ్ బాస్ సీజన్ 6 కి కూడా బాలయ్య హోస్ట్ గా వ్యవహరించే అవకాశం కలదని పలు కథనాల సారాంశం. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని చిత్రానికి సిద్ధమవుతున్నాడు. క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ ఫార్మ్ లోకి వచ్చిన గోపిచంద్ బాలయ్యతో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారు. 
  

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే