బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ కౌశల్ అన్నకే: కౌశల్ ఆర్మీ సభ్యులు!

Published : Sep 20, 2018, 11:49 AM IST
బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ కౌశల్ అన్నకే: కౌశల్ ఆర్మీ సభ్యులు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి దక్కని ప్రేక్షకాదరణ కౌశల్ కి దక్కింది. అతడి కోసం కౌశల్ ఆర్మీ తయారైంది. సోషల్ మీడియాలో కౌశల్ విన్నర్ కావాలని ఈ ఆర్మీ ఎక్కువ శాతం ఓట్లు కౌశల్ కి నమోదయ్యేలా చూస్తోంది. 

బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి దక్కని ప్రేక్షకాదరణ కౌశల్ కి దక్కింది. అతడి కోసం కౌశల్ ఆర్మీ తయారైంది. సోషల్ మీడియాలో కౌశల్ విన్నర్ కావాలని ఈ ఆర్మీ ఎక్కువ శాతం ఓట్లు కౌశల్ కి నమోదయ్యేలా చూస్తోంది. అయితే గత రెండు రోజులుగా బిగ్ బాస్ షోలో కౌశల్ కి ఇతర హౌస్ మేట్స్ కి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఎంతగా అంటే ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. దీంతో బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కౌశల్ విజేత కావడం బిగ్ బాస్ టీమ్ కి ఇష్టం లేదని, అందుకే కౌశల్ ని బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కౌశల్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటాడని మరో కొత్త వార్త వినిపిస్తోంది. దీంతో కౌశల్ ఆర్మీ నేరుగా బిగ్ బాస్ సెట్స్ కి వెళ్లి టీమ్ తో మాట్లాడారు.

దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బిగ్ బాస్ టీమ్ కూడా కౌశల్ కే సపోర్ట్ చేస్తుందని.. ఎవరూ టెన్షన్ పడొద్దని కౌశల్ అభిమానవులకు చెప్పారు. కౌశల్ ని బయటకి పంపించేస్తున్నారా..? అని బిగ్ బాస్ టీమ్ ని అడగగా.. కౌశల్ లేకపోతే షో ఉంటుందా..? అని వారే అడుగుతున్నారని కౌశల్ ఆర్మీ సభ్యులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిన్నారి ప్రాణం కాపాడి గొప్ప మనసు చాటుకున్న శ్రుతి హాసన్, ఏం చేసిందో తెలుసా
అల్లు అర్జున్ కి షాక్.. నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ దుమారం, పుష్ప 2, యానిమల్ సినిమాలను దాటి నెం.1 స్థానం