లవర్ బాయ్ నుంచి విలక్షణ నటుడిగా మారిన మాధవన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

Published : Jun 01, 2025, 04:50 PM IST
R Madhavan

సారాంశం

నటుడు మాధవన్ తన 55వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన ఆస్తుల విలువ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

నటుడు మాధవన్ జూన్ 1న తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1970లో జంషెడ్‌పూర్‌లో జన్మించిన ఆయన తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 2023లో 'రాకెట్రీ' సినిమాతో దర్శకుడిగా మారారు. ఇది మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ.

మాధవన్ కి గుర్తింపు తెచ్చిన చిత్రాలు 

2001లో 'రెహనా హై తేరే దిల్ మే' సినిమాతో మాధవన్ ప్రశంసలు అందుకున్నారు. జ్యోతికతో 'డోలీ సజా కే రఖ్నా' (1998)లో నటించారు. మణిరత్నం దర్శకత్వంలో 2000లో వచ్చిన 'అలైపాయుతే' ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతోనే ఆయనకు చాక్లెట్ బాయ్ ఇమేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు మాధవన్ విలక్షణ నటనతో మెప్పిస్తున్నారు. 

కేసరి 2లో లాయర్ గా.. 

'కేసరి 2'లో అక్షయ్ కుమార్‌తో కలిసి నటించారు. 'సైతాన్'లో విలన్‌గా నటించి అలరించారు. తమిళంలో ఇటీవల నటించిన 'టెస్ట్' చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో నయనతారతో కలిసి నటించారు. 

కేసరి 2 చిత్రంలో మాధవన్ బ్రిటిష్ ప్రభుత్వం తరుపున వాదించే లాయర్ పాత్రలో నటించారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో అనన్య పాండే కీలక పాత్రలో నటించింది. 

మాధవన్ పారితోషికం 

'3 ఇడియట్స్' సినిమాకు మాధవన్‌కు 65 లక్షలు పారితోషికం ఇచ్చారు. 'సైతాన్' వెబ్ సిరీస్‌కు 10 కోట్లు అందుకున్నారు. 15-16 ఏళ్లలో ఆయన పారితోషికం 1468% పెరిగింది. సంవత్సరానికి 12 నుంచి 15 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. 

మాధవన్ ఆస్తులు 

మాధవన్ ఆస్తుల విలువ 115 కోట్లు ఉంటుందని అంచనా. కథ నచ్చితేనే సినిమాల్లో నటిస్తారు. గత నాలుగేళ్లుగా డబ్బు సంపాదించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బైక్‌లంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా లగ్జరీ బైక్‌లు కొన్నారు.     

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి