స్పోర్ట్స్ పై ఫోకస్‌ పెట్టిన మాధవన్‌.. ఒలింపిక్స్ మెడలే లక్ష్యంగా దుబాయ్‌కి..

Published : Dec 17, 2021, 08:41 PM ISTUpdated : Dec 17, 2021, 08:43 PM IST
స్పోర్ట్స్ పై ఫోకస్‌ పెట్టిన మాధవన్‌.. ఒలింపిక్స్ మెడలే లక్ష్యంగా దుబాయ్‌కి..

సారాంశం

కుమారుడి కోసం మాధవన్‌ కొడుకు వేదాంత్‌ స్పోర్ట్స్ లో రాణిస్తున్నారు. స్విమ్మర్‌గా నేషనల్‌ వైడ్‌గా ప్రతిభని చాటుకున్నారు. నేషనల్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌గా నిలిచారు. మహారాష్ట్రలో జరిగిన స్విమ్మింగ్‌ పోటీల్లో ఏకంగా ఏడు మెడల్స్ సాధించాడు వేదాంత్‌. 

రొమాంటిక్‌ హీరో నుంచి విలక్షణ నటుడిగా టర్న్ తీసుకున్న ఆర్‌ మాధవన్‌(R Madhavan) స్పోర్ట్స్ పై దృష్టి పెట్టారు. తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు క్రీడలపై ఫోకస్‌ పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆయన ఫోకస్‌ పెడుతున్నది తన కోసం కాదు, తన కుమారుడి కోసం Madhavan కొడుకు వేదాంత్‌ స్పోర్ట్స్ లో రాణిస్తున్నారు. స్విమ్మర్‌గా నేషనల్‌ వైడ్‌గా ప్రతిభని చాటుకున్నారు. నేషనల్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌గా నిలిచారు. మహారాష్ట్రలో జరిగిన స్విమ్మింగ్‌ పోటీల్లో ఏకంగా ఏడు మెడల్స్ సాధించాడు వేదాంత్‌. 

భారత్‌ తరఫున ఒలింపిక్స్ 2026లో వేదాంత్‌ ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. కోవిడ్‌ ఆంక్షల దృష్ట్యా భారత్‌లో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్‌ పూల్‌ లు అందులో బాటులు లేవు.  దీంతో కొడుకు ట్రైనింగ్‌ కోసం మాధవన్‌, ఆయన భార్య సరితతో కలిసి దుబాయ్‌కి వెళ్లాడు మాధవన్‌. `కోవిద్‌ ఆంక్షల కారణంగా ముంబయిలోని పెద్ద స్విమ్మింగ్‌ పూల్‌లను మూసేశారు.దుబాయ్‌లో ఒలింపిక్స్ స్థాయి స్వమ్మింగ్‌ పూల్‌లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల వేదాంత్‌ ట్రైనింగ్‌కి అనుకూలంగా ఉంటుందని ఇక్కడకి వచ్చాం` అని తెలిపారు మాధవన్‌. 

తన కుమారుడిని నటుడిగా మార్చడం తనకు ఇష్టం లేదన్నారు. జీవితంలో తను ఏం చేయాలనుకుంటే అది చేయనిస్తాం. ప్రస్తుతం వేదాంత్‌ ప్రపంచ వ్యాప్తంగా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ షిప్స్ లలో పతకాలు గెలుస్తున్నారు. మేం గర్వపడేలా చేస్తున్నాడు. అతడి రెక్కలను మేం కట్టేయలేమని తెలిపారు మాధవన్‌. జనరల్‌గా సినిమా రంగంలో ఉన్న ఎవ్వరైనా తమ వారసులను సినిమాల్లోకే తీసుకువస్తుంటారు. హీరోలుగా రాణింప చేసేప్రయత్నం చేస్తారు. నటన రాకపోయినా, హీరో క్వాలిటీస్‌ లేకపోయినా బలవంతంగా జనాలపై రుద్దుతుంటారు. ఆడియెన్స్ కి అలవాటి చేసి వదిలేస్తారు. దీంతో వాళ్లే హీరోగా చెలామణి అవుతుంటారు. 

కానీ మాధవన్‌ మాత్రం అలా చేయలేదు. తన కుమారుడికి ఇష్టమైన రంగంలో రాణించేందుకు ప్రోత్సహిస్తున్నారు. దేశం గర్వంచే క్రీడాకారుడిని తయారు చేస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక మాధవన్‌ నటుడిగా మల్టీ లింగ్వల్‌ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. `సవ్యసాచి`, `నిశ్శబ్దం` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన మాధవన్‌ ప్రస్తుతం `రాకెట్రీ`, `అమృకి పండిత్‌`, `దోఖా రౌండ్‌ డీ కార్నర్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

also read: `నిక్‌ జోనాస్‌ భార్య` అన్నందుకు చెడుగుడు ఆడుకున్న గ్లోబల్‌ బ్యూటీ.. ఇంకా ఎన్నాళ్లంటూ అసహనం..
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే