అంజలి ఐటమ్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్, భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నపాట

Published : Aug 05, 2022, 06:37 AM IST
అంజలి ఐటమ్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్, భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నపాట

సారాంశం

ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. ప్రతీ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్.. స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆ సాంగ్ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం.. సినిమాపై హైప్స్ పెరుగుతున్నాయి. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా అంజలీ ఐటమ్ సాంగ్ ఇలాగే దూసుకుపోతోంది.    

ఈ మధ్య ప్రతీ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్.. స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . ఆ సాంగ్ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం.. సినిమాపై హైప్స్ పెరుగుతున్నాయి. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా అంజలీ ఐటమ్ సాంగ్ ఇలాగే దూసుకుపోతోంది.  

ఈ మధ్య కాలంలో ఐటమ్ సాంగ్స్ చాలా ఫాస్టుగా పాపులర్ అవుతున్నాయి. అలా  అయిన ఐటమ్ సాంగ్స్ లో మాచర్ల నియోజకవర్గం సినిమాలోని ఐటమ్ సాంగ్ కూడా ఒకటి. నితిన్ సొంత బ్యానర్లో నిర్మిస్తూ హీరోగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి, . కేథరిన్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించగా... సీనియర్ హీరోయిన్ అంజలీ ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. ఇక ఈసినిమాకు  మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.

రీసెంట్ గా  ఈ సినిమా నుంచి అంజలి - నితిన్  మధ్య సాగే అదిరిపోయే  ఐటమ్ సాంగ్ ను వదిలారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సాంగ్.. నితిన్ ఫస్ట్ మూవీ జయం సినిమా లో పాటు గుర్తు చేస్తూ.. పాటతో ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు. ఇక  యూ ట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా యాప్స్ లో ఈ సాంగ్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అన్ని  కలుపుకుని ఈపాట  దాదాపు 500 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టడం విశేషం. 

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. పొలిటికల్ డ్రామాతో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ గా మాచర్ల నియోజకవర్గం సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన  అప్ డేట్ వీడియోస్ తో పాటు పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ కు  అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.  హీరో హీరోయిన్లతో పాటు.. రాజేంద్రప్రసాద్ ,సముద్రఖని ,మురళీ శర్మ ,వెన్నెల కిశోర్  లాంటి సీనియర్ నటులు ముఖ్యమైన పాత్రను పోషించిన ఈసినిమాను... ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా  భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2 Day 4 Box Office: ఐదో రోజు డీలా పడ్డ 'ధురంధర్ 2', 4 రోజుల్లో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్‌
Ustaad Bhagat Singh Day 4 Collections: పవన్‌ సినిమాకి ఈ కలెక్షన్లు ఎవరూ ఊహించరు.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి 4 రోజుల వసూళ్లు ఇవే