Maayon: హీరోగా కట్టప్ప తనయుడు.. ఎంట్రీ సాంగ్ అదిరిపోయింది.

Published : Dec 15, 2021, 01:46 PM IST
Maayon: హీరోగా కట్టప్ప తనయుడు.. ఎంట్రీ సాంగ్ అదిరిపోయింది.

సారాంశం

బాహుబలి కట్టప్ప, తమిళ సీనియర్ హీరో.. సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్నసినిమా మాయోన్. ఈ మూవీ  నుంచి విడుద‌లైన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘మాంపాహి’ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.   

కోలీవుడ్ లో సీనియర్ హీరోగా.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సాధించారు సత్యరాజ్. హీరోగా స్టార్ డమ్ ను చూసిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అంతే స్టార్ డమ్ తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా సత్యరాజ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా తరువాత ఆయనకు టాలీవుడ్ లో కూడా భారీగా ఆఫర్లు వచ్చాయి. ఇక ఈ సీనియర్ హీరోతనయుడు శిబి హీరోగా పరిచయం అవుతున్నారు. 


సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'మాయోన్'. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్సాన్స్ వచ్చించి. రీసెంట్ గా ఈ సినిమానుంచి ‘మాంపాహి’ అనే పాట రిలీజ్ చేశారు టీమ్. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. 


మ్యూజిక‌ల్ మేజిషియ‌న్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత అందించిన ఈ సినిమాను కిషోర్ ఎన్ ఈ డైరెక్ట్ చేస్తున్నారు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్‌లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.  ఇక మాంపాహి పాట ఇప్పుడు తెలుగు,త‌మిళ రాష్ట్రాల్లో ఉన్న ఇళ‌య‌రాజా అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది, దీంతో ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


 మాంపాహి పాట తమిళ వెర్ష‌న్ సాంగ్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది యూ ట్యూబ్ లో రిలీజ్ అయిన 24 గంటల లోపే మిలియ‌న్ వ్యూస్ పైగా అందుకోవ‌డం విశేషం. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈసినిమా రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేస్తామన్నారు మూవీ టీమ్. 
 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన