'మా' అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణ స్వీకారం!

Published : Mar 22, 2019, 03:07 PM IST
'మా' అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణ స్వీకారం!

సారాంశం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించినరేష్ కి, శివాజీ రాజాకి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి నరేష్ కి, శివాజీ రాజాకి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడిన సంగతి  తెలిసిందే.

అయితే ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారానికి శివాజీరాజా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మా' కమిటీ భవిష్యత్తులో అధ్బుతాలు చేయాలని కోరారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. 

మరిన్ని విషయాలు చెబుతూ... ''నాకంటే ముందు అధ్యక్షులుగా పని చేసిన వారు ఎక్కడినుండో ఫండ్స్ తీసుకొచ్చి పెట్టామని, దాంట్లో నుండి పైసా కూడా కదపకుండా చూసుకున్నామని.. మీరు కష్టపడి బయటనుండి ఫండ్స్ తీసుకురావాలని చెప్పారు.

నేను వారి మాటను ఫాలో అయ్యాను. అదే విధంగా ఇప్పుడు పని చేయబోయే కమిటీ కూడా కష్టపడాలని ఆశిస్తున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు. కమిటీకి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని అన్నారు. 'మా' కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాటను సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా విడుదల చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం