ప్రకాష్ రాజ్ కోసం.. జయసుధ, సాయి కుమార్ వీడియో సందేశాలు!

By team teluguFirst Published Jun 25, 2021, 12:30 PM IST
Highlights

ప్రకాష్ రాజ్ విడుదల చేసిన 27మంది ప్యానెల్ లో సభ్యులుగా ఉన్న సాయి కుమార్, జయసుధ ఈ ప్రెస్ మీట్ కి రాలేకపోయారు. అయితే వీరిద్దరూ తమ నివాసాల నుండే వీడియో సందేశం ద్వారా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులుగా ఆయనకు మద్దతు కోరుతూ మాట్లాడారు. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ తనకు మద్దతు తెలుపుతున్న నటులతో పాటు మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. శ్రీకాంత్, నాగబాబు, బండ్ల గణేష్, బెనర్జీలతో పాటు మరికొందరు నటులు మీడియా సమావేశంలో పాల్గొని, తమ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. 


ఇక ప్రకాష్ రాజ్ విడుదల చేసిన 27మంది ప్యానెల్ లో సభ్యులుగా ఉన్న సాయి కుమార్, జయసుధ ఈ ప్రెస్ మీట్ కి రాలేకపోయారు. అయితే వీరిద్దరూ తమ నివాసాల నుండే వీడియో సందేశం ద్వారా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులుగా ఆయనకు మద్దతు కోరుతూ మాట్లాడారు. 


జయసుధ మాట్లాడుతూ... ప్రకాష్ రాజ్ నేను చాలా చిత్రాలలో కలిసి నటించాం. మంచి పెయిర్ గా మా కాంబినేషన్ కి అభిమానులు ఉన్నారు. 2018లోనే ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని చెప్పారు. మరోమారు రెండు మూడు నెలల క్రితం మేము కలవడం ఆయన ప్రణాళిక గురించి వివరించారు. ప్రకాష్ లాంటి విజన్ ఉన్న వ్యక్తి మా అధ్యక్షుడు కావాలి. ఆయన ఏ ఏదైనా అనుకుంటే సాధించే తత్త్వం కలవారు. ఆయన ప్యానెల్ లో మెంబర్ గా ఉన్న నేను ఆయనను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే మీ అందరి మద్దతు కోరుతున్నాను. మేము విజయం సాధించగలం అనే నమ్మకం ఉంది.. అని అన్నారు. 


అలాగే సాయి కుమార్.. సినీ 'మా' బిడ్డలం మన కోసం మనం 'మా' కోసం మనం అనే నినాదంతో  మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో నేను సపోర్ట్ గా ఉన్నందుకు అనందంగా ఉంది. మేము అందరం ఆయనను సప్పోర్ట్ చేస్తున్నాం, అలాగే మీ అందరి సప్పోర్ట్ కోరుతున్నాం. ఆ  కళామతల్లి బిడ్డలుగా అందరి సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నాం.. అన్నారు
 

click me!