ప్రభాస్ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దాంతో ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని ఎక్కడెక్కడి డైరక్టర్స్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
'ఖైదీ', 'మాస్టర్' వంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో 'విక్రమ్' అనే సినిమా చేస్తున్నారు. ఆయన నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తోనే తదుపరి సినిమా అన్నా కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ఏమీ ముందుకు వెళ్లినట్లు అనిపించలేదు. ఈ నేపధ్యంలో ...ఆయన .. ప్రభాస్‌తో సినిమా చేయనున్నారనే వార్త వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే స్టోరీలైన్ రెడీ అయ్యిందని, ప్రభాస్ కి కూడా చెప్పటం జరిగిందని చెప్తున్నారు.
లోకేష్ కనగరాజ్ తో చేయబోయే సినిమా సైతం పాన్ ఇండియా స్దాయి అంటున్నారు. పూర్తి స్దాయి స్క్ర్రిప్టుని రెడీ చేయమని ప్రభాస్ పురమాయించాడట. 2022లో మొదలయ్యే ఈ సినిమా ఖైధీలాంటి డిఫరెంట్ ఎప్రోచ్ ఉన్న సబ్జెక్ట్ అని, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న ఓ సమస్యను ఈ సినిమాలో ప్రస్దావిస్తాడని అంటున్నారు. అలాగే భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతోందిట. నాగ్ అశ్విన్ డైరక్ట్ చేయబోయే సినిమా తర్వాత రిలీజ్ ఉంటుంది కాబట్టి అప్పటి ఎక్సపెక్టేషన్స్ ని మ్యాచ్ అయ్యేలా సినిమా చేస్తాడట.
ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్' చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తారు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ - లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు తెలిసింది. ప్రభాస్ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దాంతో ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని ఎక్కడెక్కడి డైరక్టర్స్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.