Waltair Veerayya: వాల్తేరు వీరయ్య మూవీలో లిప్ లాక్ సీన్.! 

Published : Dec 14, 2022, 09:59 AM IST
Waltair Veerayya: వాల్తేరు వీరయ్య మూవీలో లిప్ లాక్ సీన్.! 

సారాంశం

ఇద్దరు సీనియర్ హీరోలు నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయన్న వార్త కాకరేపుతుంది. చిరు, రవితేజలలో హీరోయిన్ పెదాలను ముద్దాడేది ఎవరనే చర్చ మొదలైంది.   

వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. చిరంజీవి, శృతి హాసన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మాస్ మహారాజ్ రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన విక్రమ్ సాగర్ ఏసీపీ గా కనిపించనున్నారు. రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ దుమ్మురేపింది. చేతిలో మేకపిల్లతో వచ్చి విధ్వంసం చేశాడు. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. 

ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే... ఘాడమైన లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయట. మాస్ హీరోలు అందులోనూ వయసులో పెద్దవాళ్ళైన చిరంజీవి(Chiranjeevi)-రవితేజ నటిస్తున్న మూవీలో లిప్ లాక్ సన్నివేశాలు ఏమిటని టాలీవుడ్ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిరు, రవితేజలలో ఎవరు హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేస్తున్నారనే ఉత్కంఠ రేగుతుంది. 

వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవికి జంటగా శృతి హాసన్(Shruti Haasan) నటిస్తున్నారు. ఇక రవితేజతో కేథరిన్ థెరిస్సా నటిస్తున్నారు. కథ రీత్యా రవితేజ-కేథరిన్ మధ్య ఘాడమైన లిప్ లాక్ సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశంలో రవితేజ, కేథరిన్ మొహమాటం లేకుండా నటించారంటూ విశ్వసనీయవర్గాల సమాచారం. మరి చిరంజీవి మూవీలో రవితేజ ముద్దు సీన్ ఏ స్థాయిలో రొమాన్స్ పంచిందో చూడాలి. 

దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. విడుదలైన బాస్ పార్టీ సింగిల్ దుమ్మురేపుతోంది. వాల్తేరు వీరయ్య మూవీపై పరిశ్రమలో మంచి హైప్ నెలకొంది. అలాగే బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 17 అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు భారీ ప్లాన్ వేసి శ్రీవల్లి, భాగ్యం.. కానీ
Thanuja: సీరియల్స్ కి తనూజ గుడ్‌ బై.. ఇకపై ఆమె టార్గెట్‌ ఇదే.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి వెళ్లిన కారణం ఇదేనా