Bigg Boss Telugu 6: ఇలా వందేళ్లు బతుకుతా.. ఆదిరెడ్డి ఎమోషనల్‌ కామెంట్.. రోహిత్‌ని మొసలితో పోల్చిన బిగ్‌బాస్

Published : Dec 13, 2022, 11:46 PM IST
Bigg Boss Telugu 6: ఇలా వందేళ్లు బతుకుతా.. ఆదిరెడ్డి ఎమోషనల్‌ కామెంట్.. రోహిత్‌ని మొసలితో పోల్చిన బిగ్‌బాస్

సారాంశం

హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లకి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికాడు బిగ్‌ బాస్‌. నిన్న రేవంత్‌, శ్రీసత్యలకు వెల్‌కమ్‌ చెప్పగా, ఈ రోజు ఆదిరెడ్డి, రోహిత్‌లకు వెల్కమ్‌ పలికాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, రోహిత్‌లు ఎమోషనల్‌ అయ్యారు.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 చివరి వారం చేరింది. వచ్చే ఆదివారంతో ఈ సీజన్‌ పూర్తి కాబోతుంది. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లకి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికాడు బిగ్‌ బాస్‌. నిన్న రేవంత్‌, శ్రీసత్యలకు వెల్‌కమ్‌ చెప్పగా, ఈ రోజు మంగళవారం ఆదిరెడ్డి, రోహిత్‌లకు వెల్కమ్‌ పలికాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, రోహిత్‌లు ఎమోషనల్‌ అయ్యారు. మొదట శ్రీహాన్‌, రేవంత్ ల మధ్య గత విషయాలు చర్చకు వచ్చాయి. స్నేహం గురించి వీరిద్దరు కామెంట్లు చేసుకున్నారు. ఓ విషయంలో శ్రీహాన్‌ని నిలదీశాడు రేవంత్‌. దీంతో ఇద్దరూ కాస్త హాట్‌గానే చర్చించుకున్నారు. 

అనంతరం ఆదిరెడ్డిని గార్డెన్‌ ఏరియాకి పిలిచారు బిగ్‌ బాస్‌. గార్డెన్‌ మొత్తం ఆదిరెడ్డి హౌజ్‌లో ఉన్న రోజుల్లోని మధుర క్షణాలను బంధించి ఫోటోలు, వీడియోల రూపంలో బంధించారు. అక్కడ అమర్చారు. వాటిని చూసి సంబరపడిపోయాడు ఆదిరెడ్డి. తన భార్యతో ఫోన్‌ సందేశానికి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అనంతరం ఆదిరెడ్డిని జర్నీని వర్ణించాడు బిగ్‌ బాస్‌. కామన్‌ మ్యాన్‌ గా వచ్చి ఇప్పుడు అందరి మనసుల్లో నిలిచిపోయావని ఒక రేంజ్‌లో ఆయన గురించి చెప్పారు. ఫైనల్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతూ అభినందనలు తెలియజేశారు. ఆదిరెడ్డి జర్నీ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఎమోషనల్‌గా సాగింది. దాన్ని చూసి ఆదిరెడ్డి సైతం ఎమోషనల్ అయ్యారు. 

ఒక కామన్‌ మ్యాన్‌గా తనని హౌజ్‌లోకి వచ్చానని, బిగ్‌బాస్‌ తనని సెలబ్రిటీ చేసిందన్నారు. ఇది తనకు మోస్ట్ ఎమోషనల్‌ మూవ్‌ మెంట్‌ అన్నారు. హౌజ్‌లో లాస్ట్ సెకన్‌ వరకు ఉండాలనే తన కల నెరవేరిందన్నారు. తనకి ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు తన గుండెల్లో ఉంటారని తెలిపారు. చాలా గర్వపడే మూవ్మెంట్‌ అని, జీవితాంతం బిగ్‌బాస్‌ కి రుణపడి ఉంటానన్నారు. బిగ్‌ బాస్‌ తన లైఫ్‌ని మార్చిందని, సెటిల్డ్ కాని తనని, బిగ్‌ బాస్‌ రివ్యూస్‌ చెప్పడంతో మంచి స్థానంలో నిలబడేలా చేసిందని, ఎప్పటికీ బిగ్‌ బాస్‌తోనే నా జీవితం అని తెలిపారు. ఇప్పుడు చాలా ఆనందంలో ఉన్నానని, ఇదే ఆనందం ఇంకా రెండుమూడేళ్లు ఉంటే వందేళ్లు హ్యాపీగా బతికేస్తానని చెప్పారు ఆదిరెడ్డి. ఈ సందర్భంగా రాజ్‌, బాలాదిత్య, గీతూ, ఫైమాలను చాలా మిస్‌ అవుతున్నానని, వారికి థ్యాంక్స్ చెప్పారు ఆదిరెడ్డి. తప్పులు చేసి ఉంటే క్షమించాలని పేర్కొన్నారు. ఆడియెన్స్ కి రుణపడి ఉంటానని తెలిపారు.

అనంతరం రోహిత్‌ వంతు వచ్చింది. చాలా స్ట్రాంగ్‌గా ఉండే రోహిత్‌ సైతం తన ఫోటోలు, తన భార్య ఇన్‌ స్పైరింగ్‌ వర్డ్స్ విని ఎమోషనల్‌ అయ్యారు. అంతేకాదు బిగ్‌ బాస్‌ తన గురించి చెప్పిన తీరుకి పడిపోయాడు రోహిత్‌. రోహిత్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని మెరినా చెప్పింది. కిస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు రోహిత్‌ని మొసలితో పోల్చాడు బిగ్‌బాస్‌. మొసలి బలం నీటిలోనే ఉంటుందని, బయటకు వస్తే అది చాలా కామ్‌గా ఉంటుందని, సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తుందని అలా రోహిత్‌ ఉన్నాడని వర్ణించిన తీరుకి పడిపోయాడు రోహిత్‌. మరింత ఎమోషనల్‌ అయ్యారు. ఆయన జర్నీని ఆద్యంతం ఆకట్టుకుంది. చివరగా రోహిత్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పాడు బిగ్‌ బాస్‌. ఫైనల్‌కి అభినందనలు తెలిపారు. ఇక రేపు కీర్తి, శ్రీహాన్‌లకు అభినందనలు చెప్పే అవకాశం ఉంది. అదే సమయంలో రేపు ఒకరిని ఎలిమినేట్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే