కమల్ హాసన్ వల్ల భారీగా నష్టపోయాం, వారానికొకసారి కథ మార్చేసేవారు.. ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్

Published : Apr 18, 2024, 10:04 PM ISTUpdated : Apr 19, 2024, 11:52 AM IST
కమల్ హాసన్ వల్ల భారీగా నష్టపోయాం, వారానికొకసారి కథ మార్చేసేవారు.. ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్

సారాంశం

లోక నాయకుడు కమల్ హాసన్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు ఇష్టపడుతుంటారు. ఆయన కెరీర్ లో నటనకి ప్రాధాన్యత ఉంటూ. వైవిధ్యంగా ఉన్న కథలే ఎక్కువగా కనిపిస్తాయి. కమల్ హాసన్ ఫక్తు కమర్షియల్ చిత్రాలు చేసింది చాలా తక్కువ.

లోక నాయకుడు కమల్ హాసన్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు ఇష్టపడుతుంటారు. ఆయన కెరీర్ లో నటనకి ప్రాధాన్యత ఉంటూ. వైవిధ్యంగా ఉన్న కథలే ఎక్కువగా కనిపిస్తాయి. కమల్ హాసన్ ఫక్తు కమర్షియల్ చిత్రాలు చేసింది చాలా తక్కువ. ఈ క్రమంలో కమల్ హాసన్ 2015లో ఉత్తమ విలన్ అనే చిత్రంలో నటించారు. 

ఈ చిత్రానికి కమల్ హాసన్ తో పాటు. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి కూడా నిర్మాత. ఉత్తమ విలన్ చిత్రం వల్ల తాము భారీగా నష్టాల్లో కూరుకుపోయినట్లు లింగుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ విలన్ నష్టాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ మూవీ విషయంలో మాకు ఏదీ కలసి రాలేదు. 

ఈ చిత్రం పరాజయం తర్వాత 30 కోట్ల బడ్జెట్ లో మరో సినిమా చేస్తానని కమల్ హామీ ఇచ్చారు. ఇంతవరకు అది జరగలేదు. ఉత్తమవిలన్ కథలో కమల్ హాసన్ వారానికొకసారి మార్పులు చేసేవారు. గతంలో కమల్ హాసన్ చాలా చిత్రాలకు ఆ విధంగా చేసి విజయాలు అందుకున్నారు. 

కానీ ఉత్తమ విలన్ మూవీ విషయంలో అది వర్కౌట్ కాలేదు అని లింగుస్వామి తెలిపారు. కమల్ హాసన్ తో దృశ్యం రీమేక్ మేము చేయాలనుకున్నాము. కానీ అది కుదర్లేదు. మరో నిర్మాతతో ఆయన దృశ్యం మూవీ చేసిన సక్సెస్ అందుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్