నార్త్ లో అల్లు అర్జున్ డామినేషన్... వార్ 2 కూడా పుష్ప 2 తర్వాతే!

By Sambi ReddyFirst Published Apr 18, 2024, 7:02 PM IST
Highlights

అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ లో ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ. హిందీ స్ట్రెయిట్ మూవీ వార్ 2కి మించిన పాపులారిటీ పుష్ప 2కి అక్కడ నెలకొని ఉంది. 
 

పుష్ప మూవీ అల్లు అర్జున్ ఇమేజ్ ఎల్లలు దాటించింది. ఈ ముహూర్తాన ఆ చిత్రం చేశాడో కానీ నార్త్ ఆడియన్స్ ఆయనంటే విపరీతంగా ఇష్టపడుతున్నారు. దర్శకుడు సుకుమార్ మొదట్లో  పుష్పను పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకోలేదు. రాజమౌళి సలహాతో కథను రెండు భాగాలు విభజించి పార్ట్ 2 ప్రకటించాడు. ఇది సుదీర్ఘమైన కథ. రెండు భాగాలు చెప్పడం ఉత్తమం, అందుకే ఈ నిర్ణయం అని సుకుమార్ అప్పట్లో చెప్పారు. 

బాలీవుడ్ లో పుష్పను పెద్దగా ప్రమోట్ చేయలేదు. దాంతో ఫస్ట్ డే కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు దక్కాయి. వర్డ్ ఆఫ్ మౌత్ తో పుంజుకున్న పుష్ప లాంగ్ రన్ బాలీవుడ్ లో సత్తా చాటింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ పుష్ప అన్ని భాషల్లో కలిపి రూ. 360 కోట్ల వసూళ్ల వరకు రాబట్టింది. ముఖ్యంగా పుష్ప అల్లు అర్జున్ కి నార్త్ లో విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. 

ఆ ఎఫెక్ట్ పుష్ప 2పై కనిపిస్తుంది. కనీసం ట్రైలర్ కూడా రాలేదు అంచనాలు ఆకాశానికి చేరాయి. రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. పుష్ప 2 హిందీ రైట్స్ రూ. 200 కోట్లకు  అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల సమాచారం. కాగా ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ రానున్న బాలీవుడ్ చిత్రాల్లో దేని కోసం ఎదురుచూస్తున్నారు సర్వే చేయగా... పుష్ప 2 టాప్ లో నిలిచింది. 

పుష్ప 2 మొదటి ర్యాంక్ సాధించింది. పుష్ప 2 తర్వాత హేరా పేరి 3 సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. అనంతరం భోల్ బులయా 2 నిలిచింది. వార్ 2కి నాలుగో స్థానం దక్కింది. సింగం అగైన్ ఐదో స్థానంలో నిలిచింది. పుష్ప 2 మినహాయిస్తే మిగతావన్నీ స్ట్రెయిట్ హిందీ చిత్రాలు. అయినప్పటికీ నార్త్ ఆడియన్స్ పుష్ప పట్ల అధిక ఆసక్తి కనబరిచారు. వార్ 2లో ఎన్టీఆర్ నటించడం విశేషం. 

పుష్ప 2 ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 ఊహించని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది... 
 

Most-awaited Hindi films, as on Apr 15, 2024 (only films releasing Jun 2024 onwards whose trailer has not released yet have been considered) pic.twitter.com/oIF8rRwkvm

— Ormax Media (@OrmaxMedia)
click me!