`వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి లైన్‌ క్లీయర్.. వేదిక మారింది..

Published : Jan 07, 2023, 08:13 PM IST
`వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి లైన్‌ క్లీయర్.. వేదిక మారింది..

సారాంశం

చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అనేక అవాంతరాల అనంతరం ఎట్టకేలకు వెన్యూ ఫిక్స్ అయ్యింది. మరో వేదికన ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.

ఏపీ ప్రభుత్వం నుంచి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకి సంబంధించిన తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. నిన్న బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషయంలోనూ అదే జరిగింది. చిత్ర యూనిట్‌ నిర్వహించాలనుకున్న వెన్యూకి పర్మిషన్‌ ఇవ్వలేదు, దీంతో మరో చోట నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో నిర్వహించబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. 

కానీ నిర్మాతలకు షాకిచ్చారు పోలీసులు. పర్మిషన్‌ ఇవ్వలేదు. మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఓకే అన్నారనే సమాచారం వచ్చింది. మళ్లీ ఏపీ ప్రభుత్వం నుంచి అభ్యంతరం చివరికి వెన్యూ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌కి మార్చాల్సి వచ్చిందట. ఫైనల్‌గా ఈ వేదికని ఫిక్స్ చేసినట్టు తెలిపింది యూనిట్‌. అయితే ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కి నిర్మాతలు థ్యాంక్స్ చెప్పడం విశేషం. పర్మిషన్‌ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు యూనిట్‌ ఏపీ సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. 

మొత్తానికి రేపు(జనవరి 8న) వైజాగ్‌లోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. దీనికోసం యూనిట్‌ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో చిరంజీవితోపాటు రవితేజ, శృతి హాసన్‌, దర్శకుడు బాబీ, నిర్మాతలు, ఇతర చిత్ర బృందం పాల్గొనబోతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. హిందీలోనూ దీన్ని రిలీజ్‌ చేస్తుండటం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో