100 రోజులు పూర్తి చేసుకున్న కాంతార సినిమా, స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..

By Mahesh JujjuriFirst Published Jan 7, 2023, 7:42 PM IST
Highlights

కన్నడ నాట తెరకెక్కి.. పాన్ ఇండియా మూవీగా మారి.. ప్రభంజనం సృష్టించిన కాంతార సినిమా మరో మైలు రాయి దాటింది. మూవీ టీమ్ పండగ చేసుకుంటుంది. 


మరో రికార్డ్ మైలురాయిని దాటింది కాంతార సినిమా. ఈ రోజుతో ఈ సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు పూర్తి అయ్యింది. హండ్రెడ్ డేస్ ను  పూర్తి చేసుకున్న రేర్ సినిమాగా నిలిచిపోయింది. ఈకాలంలో 100 రోజుల సినిమాలు లేవు. వారం ఆడి కలెక్షన్స్ సంపాదిస్తే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవల్సిందే. ఇక కాతారా 100 రోజులు పూర్తి చేసుకున్న  సందర్భంగా ఈ సినిమా మేకర్స్ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 

 

ಬೆಳಕು..!! ಆದರೆ ಇದು ಬೆಳಕಲ್ಲ ೧00 ದಿನದ ದರ್ಶನ🔥

Celebrating 100 Days 🙏

A film we’ll always cherish, that took us back to our roots n made us fell in awe of our traditions. Kudos everyone who made it happen. pic.twitter.com/7q1DDy6l1t

— Hombale Group (@HombaleGroup)

కన్నడ నాట నుంచి వరుసగా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేస్తున్నాయి. ఈక్రమంలో వచ్చిన సినిమానే కాంతార. ఈ సినిమా కన్నడ నాట రిలీజ్ అయ్యి.. ఆతరువాత పలు భాషల్లో డబ్బింగ్ అయ్యింది. అయితే డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన ప్రతీ భాషలో ప్రభంజనం సృష్టించింది సినిమా. కన్నడ ఇండస్ట్రీలో  ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందీ కాంతార సినిమా. రిషబ్ శెట్టి - సప్తమి గౌడ జంటగా నటించిన ఈ సినిమాను రిషబ్ స్వయంగా డైరెక్ట్ చేశారు.అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు  సంగీతాన్ని సమకూర్చాడు. 

కెజియఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ మేకర్స్  నిర్మించిన ఈ సినిమా, కన్నడలో లాస్ట్ ఇయర్  సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వడంతోనే  భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈమూవీ అటు బాలీవుడ్ తో పాటు.. ఇటు సౌత్ లో అన్ని భాషల్లో ప్రభంజనం సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతీ చోట సంచలన విజయాన్ని నమోదు చేసింది. చాలా తక్కువ సమయంలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. 

కన్నడతో పాటు ఇతర భాషల్లోను విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లోను హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. అంతే కాదు భారీగా లాభాలు కూడా తెచ్చిపెట్టింది. దాదాపు 16కోట్లతో తెరకెక్కిన ఈసినిమా.. దేశవ్యాప్తంగా 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. నిర్మాతలకు భారీగా. లాభాలను తెచ్చిపెట్టింది. కర్నాటకలోని  ఒక ప్రత్యేక గిరిజన తెగకు సబంధించిన ఆచార వ్యావహారాలు, దైవ సంబంధమైన విశ్వాసం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 

click me!