బిగ్ బాస్ 2: హౌస్ మేట్స్ ని కుక్కలని తిట్టిన కౌశల్..

Published : Sep 19, 2018, 11:44 AM ISTUpdated : Sep 19, 2018, 11:45 AM IST
బిగ్ బాస్ 2: హౌస్ మేట్స్ ని కుక్కలని తిట్టిన కౌశల్..

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకి చేరుకోవడంతో హౌస్ లో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత రెండు రోజులుగా హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకి చేరుకోవడంతో హౌస్ లో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత రెండు రోజులుగా హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్, తనీష్ ఒకరినొకరు కొట్టుకునేవరకు వెళ్లింది.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో మరిన్ని వివాదాలకు దారి తీయనుందని తాజాగా విడుదలైన ప్రోమోని బట్టి తెలుస్తోంది. ''నేనేమైనా మాట్లాడితే అందరూ  కుక్కల్లా మీద పడతారు అని'' కౌశల్ హౌస్ మేట్స్ ని కుక్కలతో పోల్చాడు. వెంటనే రియాక్ట్ అయిన సామ్రాట్ ఎవర్ని కుక్కలంటున్నావ్ అంటూ కౌశల్ మీదకు వెళ్లాడు.

మరోపక్క తనీష్ కూడా కుక్కలెవరిక్కడ అంటూ గొడవకు దిగాడు. ఇక కుక్కలన్న మాటకి బాగా హర్ట్ అయిన రోల్ రైడా ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఏడుస్తున్న రోల్ ని గీతా ఓదారుస్తూ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.

ఇప్పటికే హౌస్ మేట్స్ ఒకరినొకరు గాయ పరుచుకుంటున్నారని.. నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్, తనీష్ లను హౌస్ నుండి వెళ్లిపోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఎపిసోడ్ లో ఆ గొడవలు తారాస్థాయికి చేరుకునేలా ఉన్నాయి. మరి దీనిపై బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

 

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది