స్టార్ హీరో నుండి ఆస్కార్ తీసేసుకున్నారు!

Published : Dec 13, 2018, 08:54 AM IST
స్టార్ హీరో నుండి ఆస్కార్ తీసేసుకున్నారు!

సారాంశం

సినీ ప్రపంచంలో ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అలాంటిది ఆస్కార్ సొంతం చేసుకున్న ఓ హీరో నుండి బలవంతంగా ఆస్కార్ ని తీసేసుకున్నారు.

సినీ ప్రపంచంలో ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అలాంటిది ఆస్కార్ సొంతం చేసుకున్న ఓ హీరో నుండి బలవంతంగా ఆస్కార్ ని తీసేసుకున్నారు. అయితే ఈ అవర్ హీరో కష్టపడి దక్కించుకున్నది కాదు..

అసలు విషయంలో వస్తే.. హాలీవుడ్ స్టార్ హీరో లియోనార్డ్ డికాప్రియో తెలియని వారుండరు. తనదైన నటనతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఇప్పటికే తన నటనకి గాను ఐదు సార్లు ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యారు. 2016లో 'ది రెవెనేంట్' చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు దక్కించుకున్నారు. 

ఈ అవార్డుతో పాటు డికాప్రియో వద్ద మరో అవార్డు కూడా ఉంది. 1954లో మర్లోన్ బ్రాండో అనే నటుడు 'ఆన్ ది వాటర్ ఫ్రంట్' అనే సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు ఆస్కార్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అవార్డుని మలేషియాకి చెందిన జో లో అనే పెట్టుబదిదారుడి నుండి బహుమతిగా పొందాడు డికాప్రియో.

ఇటీవల జో లోపై ఆర్ధిక నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అతడు బహుమతులుగా ఇచ్చిన వస్తువులను సైతం తిరిగి తీసేసుకుంటున్నారు. ఈ క్రమంలో డికాప్రియో వద్ద నుండి ఆస్కార్ ని బలవంతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అవార్డుని జో లో ఆరు లక్షల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి