బైక్ ని ఢీకొట్టిన హీరోయిన్ కారు.. వ్యక్తి మృతి!

Published : Dec 13, 2018, 08:16 AM IST
బైక్ ని ఢీకొట్టిన హీరోయిన్ కారు.. వ్యక్తి మృతి!

సారాంశం

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ప్రయాణిస్తోన్న కారు.. బైక్ పై వెళ్తోన్న ఓ యువకుడిని ఢీకొట్టింది. అతడు హెల్మెట్ కూడా ధరించలేదని తెలుస్తోంది. 

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ప్రయాణిస్తోన్న కారు.. బైక్ పై వెళ్తోన్న ఓ యువకుడిని ఢీకొట్టింది. అతడు హెల్మెట్ కూడా ధరించలేదని తెలుస్తోంది. పక్కనే ఉన్న డివైడర్ కి బైక్ వెళ్లి కొట్టుకోవడంతో అతడి తలకి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన జరీన్ ఖాన్ తో పాటు ఆమె టీమ్ బాధితుడిని ఆసుపత్రికి తరలించింది. ఈ యాక్సిడెంట్ గోవాలో చోటు చేసుకుంది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది.

జరీన్ ఖాన్ కారు డ్రైవ్ చేసిందా లేక మరొకరా..?అనే విషయాలు తెలియాల్సివున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన 'వీర్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది జరీన్. బాలీవుడ్ రెడీ సినిమాలో 'క్యారెక్టర్ దీలా' అనే ఐటెం సాంగ్ లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది.  ఈ ఏడాదిలో '1921' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి