ఆర్.ఆర్.ఆర్ నుండి ఎందుకు తప్పుకున్నామంటే...

Surya Prakash   | Asianet News
Published : Jul 06, 2021, 09:06 PM IST
ఆర్.ఆర్.ఆర్ నుండి ఎందుకు తప్పుకున్నామంటే...

సారాంశం

 అంత పెద్ద ప్రాజెక్టు నుంచి,  పాన్ ఇండియా మూవీ నుండి ఎందుకు బయటికి వచ్చారో ఎవరికి అర్దం కాలేదు. రకరకాల రూమర్స్ రాకముందే ముందే తాము చెప్పేస్తే బెటర్ అనుకున్నారు. దాంతో రామ్ లక్ష్మణ్ అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.  


 ఇండస్ట్రీలో టాప్ ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్. వారు గతంలో రాజమౌళి సినిమాలకు పనిచేసారు. అలాగే రాజమౌళి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ లోనూ ఎంపిక అయ్యారు. అయితే రామ్ - లక్ష్మణ్ లు ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుండి బయటికి రావడమే హాట్ టాపిక్ అయ్యింది. అయితే అంత పెద్ద ప్రాజెక్టు నుంచి,  పాన్ ఇండియా మూవీ నుండి ఎందుకు బయటికి వచ్చారో ఎవరికి అర్దం కాలేదు. రకరకాల రూమర్స్ రాకముందే ముందే తాము చెప్పేస్తే బెటర్ అనుకున్నారు. దాంతో రామ్ లక్ష్మణ్ అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

రామ్ లక్ష్మణ్ మాటల్లోనే....రాజమౌళి తో గతంలో  చేసాం. ఆ తర్వాత ఆయనతో కొంత గ్యాప్ వచ్చింది. రాజమౌళి పెద్ద సినిమాలు చేస్తుంటారు కాబట్టి.. ఆయనతో పనిచేసే టెక్నీషియన్స్ కూడా ఆయనకు తగ్గట్లుగానే ఉండాలి. ఎక్కువ కాలం ఆయనతో ట్రావెల్ చేసేందుకు రెడీగా ఉండాలి. డేట్స్ అడ్జస్ట్ అవ్వాకపోవడం వలన, అలాగే మాకు కూడా పెద్ద సినిమాలు చేయాల్సి వస్తే వరసగా 50 రోజులు ఒక్క సినిమాకే వర్క్ చేయాలి కాబట్టి .. అప్పుడు చాలా సినిమాలను వదులుకోవాల్సి వస్తోంది. అందుకే ఎక్కువగా లాంగ్ షెడ్యూల్ ఉండే సినిమాలు చేయడం తగ్గించాము. 

ఆర్.ఆర్.ఆర్ మొదలయిన కొత్తలో రామ్ చరణ్ కి గాయం కారణంగా షూటింగ్ ఆపెయ్యాల్సి వచ్చింది. అప్పుడు మాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వలన ఆర్.ఆర్.ఆర్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రాజమౌళి తో పనిచేస్తే ఆ క్రెడిట్ ఫైట్ మాస్టర్స్ కు అంతగా ఉండదు. ఎందుకంటే ప్రతి షాట్ లో కూడా రాజమౌళి ఆలోచన విధానం ఉంటుంది. యాక్షన్ సీన్ కు తగ్గట్లుగానే కంపోజ్ చేయిస్తారు కాబట్టి ఫైట్ మాస్టర్స్ కంటే ఎక్కువ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. రాజమౌళి అన్ని సన్నివేశాలకు చాలా కష్టపడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు.. అంటూ ఆర్.ఆర్.ఆర్ నుండి ఎందుకు తప్పుకున్నారో వివరణ ఇచ్చారు ఈ ఫైట్ మాస్టర్స్ ఇద్దరూ.  ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ హైదరాబాద్ లోనే ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది.   
 

PREV
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?