
విలనిజానికి కొత్త అర్థం చెప్పిన నటుడు అమ్రీష్ పురి. వివిధ బాషలలో వందల చిత్రాలలో నటించిన అమ్రీష్ పురి తన నటనతో అనేక చిత్రాలను బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచారు. తెలుగులో టాప్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో ఆయన విలన్ గా చేశారు. ఆయన విలన్ గా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆదిత్య 369వంటి చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి.
కెరీర్ లో నటుడిగా అమ్రీష్ పురి అందుకున్న అవార్డ్స్ అనేకం. బహుశా విలన్ గా అమ్రీష్ పురి అందుకున్న విజయాలు, అవార్డ్స్ దేశంలో మరే నటుడు అందుకొని ఉండరు. అంత ఘన చరిత్ర ఆయన సొంతం. జనవరి 12, 2005లో 72ఏళ్ల వయసులో అమ్రీష్ పురి మరణించడం జరిగింది. చనిపోయేవరకు కూడా అమ్రీష్ చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు.
వయసులో ఉన్న అమ్రీష్ పురి త్రో బ్యాక్ పిక్ ఒకటి వైరల్ గా మారింది. భార్య పిల్లలతో ఆయన దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. యుక్త వయసులో ఉన్న అమ్రీష్ భార్య ఊర్మిళ దేవేకర్, కొడుకు రాజీవ్ పురి, కూతురు నమ్రత పురి లతో దిగిన ఫోటో అది. నిన్న ఆయన జయంతి నేపథ్యంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.