మైక్ టైసన్ తో తలపడుతున్న విజయ్..

Published : Nov 16, 2021, 03:55 PM ISTUpdated : Nov 16, 2021, 04:00 PM IST
మైక్ టైసన్ తో తలపడుతున్న విజయ్..

సారాంశం

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో తలపడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇద్దరూ రింగ్ లో హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.   

డైనమిక్  డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri jagannadh) , రౌడీ హీరో విజయ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్. కెరీర్ లో మొదటిసారి విజయ్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా పలు బాషలలో విడుదల కానున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్ ,ధర్మ ప్రొడక్షన్స్ హౌస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. 


కాగా ఎవరూ ఊహించని విధంగా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్,లెజెండ్ మైక్ టైసన్ (Mike tyson) లైగర్ మూవీలో నటిస్తున్నారు. మైక్ టైసన్ నటిస్తున్న మొదటి ఇండియన్ మూవీ లైగర్ కావడం మరో విశేషం. కాగా ప్రస్తుతం లైగర్ షెడ్యూల్ అమెరికాలో జరుగుతుంది. కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరపనున్నారు. కాగా ఈ షెడ్యూల్ నందు మైక్ టైసన్ పాల్గొంటున్నారు. విజయ్ దేవరకొండ, టైసన్ మధ్య భీకర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.

 
మైక్ టైసన్ తో దిగిన ఓ ఫోటో పంచుకున్న విజయ్ దేవరకొండ (Vijay devarakonda).. ఆయనతో ఉన్న ప్రతి క్షణం ఓ జ్ఞాపకంగా వర్ణించారు. వాటిలో ఇది మరింత స్పెషల్ అంటూ... ఓ ఫోటో షేర్ చేశారు. దీనితో వరల్డ్ ఛాంపియన్ తో విజయ్ పోరాటాలు ఎలా ఉంటాయో చూడాలనే ఆత్రుత అందరిలో మొదలైపోయింది. లైగర్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

Also read మ్యూజిక్ డైరెక్టర్ కి పూరి జగన్నాధ్ వార్నింగ్.. ఎన్టీఆర్ కోసమే..
లైగర్ (Liger) అనంతరం విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ తో మూవీ ప్రకటించారు. అలాగే నిర్మాతగా వరుస చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. మీకు మాత్రమే చెప్తా అనే కామెడీ డ్రామా విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కింది . తాజాగా తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పుష్పక విమానం అనే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ రూపొందించారు.

Also read  ‘పుష్ఫకవిమానం’ కలెక్షన్స్: ఇక్కడ ఒకలా...ఓవర్ సీస్ లో మరోలా

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్