Lavanya Tripathi : నిహారికలాగే.. లావణ్య త్రిపాఠి కూడా అలాగే చేయబోతోంది?

By Asianet News  |  First Published Oct 30, 2023, 4:04 PM IST

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి రెండ్రోజుల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. కాగా, పెళ్లికోసం లావణ్య త్రిపాఠి.. అచ్చం నిహారిక కొణిదెల పాటించిన సంప్రదాయాన్నే పాటించబోతోంది.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఘనంగా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి ముహూర్తం దగ్గరపడనే పడింది. ఇటలీలోని టుస్కానీ సిటీలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే వివాహా కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. నవంబర్ 31న పెళ్లి జరగనుంది. 

అయితే అక్టోబర్ 31న (రేపు) హల్దీ, మెహందీ వేడుకలతో పెళ్లి సందడి మొదలు కానుంది. కాగా, హాల్దీ వేడుకకోసం లావణ్య త్రిపాఠి ఓ సంప్రదాయాన్ని పాటించబోతోంది. గతంలో నివాహారిక తన పెళ్లి కోసం చేసిన విధంగానే చేయబోతోంది. అదేంటేంటే.. హల్దీ ఫంక్షన్ కోసం నిహారిక తన తల్లి పెళ్లికోసం ధరించిన చీరను ధరించింది. ఇప్పుడు ఇదే సంప్రదాయాన్ని లావణ్య త్రిపాఠి కూడా పాటించబోతోంది. 

Latest Videos

undefined

హాల్దీ ఫంక్షన్ లో తన తల్లి పెళ్లి దుస్తులను ధరించబోతోందని సమాచారం. ఈ వార్త ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ దుస్తులు కేప్ లెహంగాలో ప్రత్యేకంగా తయారు చేసినట్టు తెలుస్తోంది. వరుణ్ - లావణ్య పెళ్లి విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. అటు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తూనే.. ఇటు సంప్రదాయాలను గౌరవిస్తుండటం అభినందనీయమంటున్నారు. 

ఈరోజు రాత్రి టుస్కానీలోని ఓ రిసార్ట్ లో మినీ పార్టీతో పెళ్లి వేడుకలు షూరూ కానుంది. రేపు సాయంత్రం మెహందీ, హాల్దీ వేడుక జరగనుంది. ఇక వరుణ్ తేజ్ కూడా మనీష్ మల్హోత్రా  డిజైన్ చేసిన దుస్తులనే ధరించబోతున్నారు. తమ పెళ్లి వేడుకలోని ప్రతి కార్యక్రమంలో స్పెషల్ గా కనిపిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ లోనే రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు హాజరుకానున్నారు. 

click me!