గీతాఆర్ట్స్ మూవీలో లావణ్య త్రిపాఠిని తప్పించేశారట.ఎందుకంటే..

Published : Sep 06, 2017, 07:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
గీతాఆర్ట్స్ మూవీలో లావణ్య త్రిపాఠిని తప్పించేశారట.ఎందుకంటే..

సారాంశం

గీతాఆర్ట్స్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన లావణ్య త్రిపాఠి రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయటంతో తప్పించేసిన గీతా ఆర్ట్స్ తాజాగా లావణ్య ను రీప్లేస్ చేసిన కన్నడ హిరోయిన్ రష్మిక

తెలుగు హిరోయిన్ లలో ఇటీవల కాలంలోో క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో తాజాగా లావణ్య త్రిపాఠి కూడా ముందుంది. ఈ సొట్టబుగ్గల చిన్నది ఇటీవల గ్లామర్ డోసె పెంచుతూ కనిపిస్తోంది. ప్రస్థుతం నాగచైతన్యతో లావణ్య త్రిపాఠి నటించిన యుద్ధం శరణం గచ్చామి మూవీ రిలీజ్ కు రెడీగా వుంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ సరసన ఆఫర్ వస్తే ఆ చిత్రాన్ని తిరస్కరించిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  

 

లావణ్య త్రిపాఠి కి కొత్తలో పెద్దగా సక్సెస్ కలిసిరాకపోయినా..సీనియర్ హీరో నాగార్జున సరసన 'సోగ్గాడే చిన్నినాయనా' చేసి మెప్పించడం .. యంగ్ హీరో నానితో 'భలే భలే మగాడివోయ్' చేసి అలరించడం ఆమెకే సాధ్యమైంది. తాజాగా తెలుగులో ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి.  

 

తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో లావణ్య తప్పుకున్నట్టు .. ఆమె స్థానంలోకి రష్మిక మందనను తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు.  వాస్తవానికి ఈ చిత్రం కోసం లావణ్య  భారీ స్థాయిలో పారితోషికం పెంచడం వలన తప్పించారనే టాక్ వినిపిస్తోంది. 

 

 ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సినిమాలో కథానాయికగా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టుగా రష్మిక మందన ట్వీట్ చేయడంతో, ఆమె విషయంలోను క్లారిటీ వచ్చేసింది

PREV
click me!

Recommended Stories

Kiccha Sudeep Daughter: సింగర్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరో కూతురు.. త్వరలోనే నటిగా ఎంట్రీ ?
Vrusshabha Review: వృషభ మూవీ రివ్యూ, మోహన్‌ లాల్‌ సినిమా ఎలా ఉందంటే ?