పెళ్లి కి ముందే  కోడలు పోస్ట్... వరుణ్ వినాయక చవితి వేడుకల్లో లావణ్య!

Published : Sep 18, 2023, 05:09 PM IST
పెళ్లి కి ముందే  కోడలు పోస్ట్... వరుణ్ వినాయక చవితి వేడుకల్లో లావణ్య!

సారాంశం

పెళ్లికి ముందే నాగబాబు ఇంట్లో లావణ్య త్రిపాఠి సందడి చేస్తుంది. వినాయక చవితి పండగ కోడలు హోదాలో నాగబాబు ఇంట్లో జరుపుకుంది..   

ఒక ప్రక్క వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముహూర్తం ఫిక్స్ చేసుకున్న జంట షాపింగ్ మొదలుపెట్టారట. తాజాగా మనీష్ మల్హోత్రా స్టోర్ కి జంటగా వెళుతూ కనిపించారు. పెళ్లి దుస్తుల కోసమే అక్కడకు వచ్చారని ప్రచారం జరుగుతుంది. గాండీవధారి అర్జున చిత్ర ప్రమోషన్స్ లో పెళ్లి తేదిపై వరుణ్ తేజ్ స్పష్టత ఇచ్చారు. పెళ్లి ఎప్పుడనేది అమ్మ నిర్ణయిస్తుంది. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో జరగవచ్చు. అత్యంత సన్నిహితులతో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నామని ఆయన చెప్పారు. 

ఆయన కామెంట్స్ కూడా త్వరలో పెళ్లి అని హింట్ ఇస్తున్నాయి. కాగా పెళ్ళికి ముందే నాగబాబు ఇంట్లో లావణ్య సందడి చేస్తుంది. నేడు వినాయక చవితి వేడుకలు అత్తింటిలో జరుపుకుంది. నాగబాబు, వరుణ్, లావణ్య, వరుణ్ తల్లి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. పెళ్లికి ముందే లావణ్య కోడలు హోదా పొందారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

లావణ్య-వరుణ్ 2017లో మిస్టర్ మూవీలో కలిసి నటించారు. అప్పుడే ప్రేమకు బీజం పడింది. చాలా కాలం వీరి వ్యవహారం రహస్యంగా ఉంది. ఓ రెండేళ్ల క్రితం మేటర్ బయటకు పొక్కింది. ఒక ప్రక్క ఘాడంగా ప్రేమించుకుంటూనే వరుణ్, లావణ్య ఖండిస్తూ వచ్చారు. 

జూన్ 9న మణికొండలో గల నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సైతం వేడుకలో పాల్గొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో ప్లాన్ చేశారని సమాచారం. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి