హీరో రాజ్‌ తరుణ్‌ని వదలని ప్రియురాలు, మరో కేసు.. కారణం ఇదే

Published : Sep 03, 2025, 08:54 PM IST
lavanya, raj tarun

సారాంశం

హీరో రాజ్‌ తరుణ్‌ ఆ మధ్య లావణ్య అనే మహిళ విషయంలో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మరోసారి ఆయనపై కేసు పెట్టింది లావణ్య. 

హీరో రాజ్‌ తరుణ్‌పై మరో కేసు నమోదైంది. గతంలో తన ప్రియురాలు లావణ్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనని పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు తనతో ఉండి, ఆ తర్వాత హ్యాండిస్తున్నాడని, మరో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని, తన వద్దకు రావడం లేదని, తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టింది. తనకు రాజ్‌ తరుణ్‌ కావాలని చెప్పింది. ఈ క్రమంలో తనపై దాడి చేశారంటూ ఆమె ఆరోపించింది. ఈ కేసు కోర్ట్ వరకు వెళ్లింది. రాజ్‌ తరుణ్‌, లావణ్యల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

రాజ్‌ తరుణ్‌పై మరోసారి కేసు పెట్టిన లావణ్య

ఇప్పుడు మరోసారి రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టింది లావణ్య. అయితే ఈ సారి రాజ్‌ తరుణ్‌ తమ కుటుంబ సభ్యులపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టింది. జూన్‌ 30న రాజ్‌ తరుణ్‌ తన అనుచరులతో కలిసి వచ్చి తమ ఫ్యామిలీ మెంబర్స్ పై దాడి చేశాడని, అలాగే బంగారం ఎత్తుకెళ్లాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ దాడిలో తన తండ్రి గాయాలపాలయ్యాడని వెల్లడించింది. అంతేకాదు తన పెంపుడు కుక్కని కూడా చంపారని ఫిర్యాదులో వెల్లడించింది లావణ్య.

పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలతో కేసు నమోదు

ఈ కేసు ఇన్నాళ్లని సీరియస్‌గా తీసుకోని పోలీసులు ఈ విషయం కాస్త సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వద్దకు వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు తాజాగా ఈ కేసుకి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారట. ప్రస్తుతం ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే రాజ్‌ తరుణ్‌, లావణ్యల మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో ఈ సారి ఈ కేసుని పోలీసులు కూడా కాస్త సీరియస్‌గానే తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. కాకపోతే రాజ్‌ తరుణ్‌ని మాత్రం లావణ్య ఇప్పట్లో వదిలేలా లేదని తెలుస్తోంది.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

దళపతి విజయ్ ప్లేస్ పై కన్నేసిన అల్లు అర్జున్ ? ఐకాన్ స్టార్ మాస్టర్ ప్లాన్ మూమూలుగా లేదుగా?
Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్