Latest Videos

బాలీవుడ్ RX100.. రొమాన్స్ డోస్ పెంచాల్సిందే!

By Prashanth MFirst Published May 12, 2019, 10:51 AM IST
Highlights

సౌత్ లో బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ తెగ ఎట్రాక్ట్ అవుతోంది. రొమాన్స్ డోస్ పెంచడంలో బాలీవుడ్ టెక్నీషియన్స్ స్టైలే వేరు. ఇప్పుడు RX100 కథను కూడా బాలీవుడ్ లో హై లెవెల్లో క్రేజ్ వచ్చేలా తెరకెక్కిస్తున్నారు

సౌత్ లో బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ తెగ ఎట్రాక్ట్ అవుతోంది. రొమాన్స్ డోస్ పెంచడంలో బాలీవుడ్ టెక్నీషియన్స్ స్టైలే వేరు. ఇప్పుడు RX100 కథను కూడా బాలీవుడ్ లో హై లెవెల్లో క్రేజ్ వచ్చేలా తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరో సునీల్ శెట్టి తనయుడు ఆహన్ శెట్టి ఆర్ఎక్స్ 100 రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 

సినిమాలో  హీరోయిన్ గా న్యూ మోడల్ తారా సుతారియా నటిస్తోంది.  అయితే తెలుగులో ఈ బోల్డ్ కంటెంట్ లో రొమాన్స్  ఏ స్థాయిలో క్లిక్కయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలో కంటే హిందీ రీమేక్ లో  రొమాన్స్ డోస్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. నటి తారా సుతారియా ఇప్పుడిపుడే బాలీవుడ్ జనాలకు కలల రాకుమారిగా మారుతోంది. 

ఇక ఆర్ఎక్స్ 100 లో ఆమె హాట్ గా కనిపించనుందట. ఇప్పటికే చాలా మంది నార్త్ జనాలు హిందిలో అనువాదమవ్వధమైన ఆర్ఎక్స్100 ని చూసేశారు. అందుకే దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేసి రొమాన్స్ డోస్ ని పెంచనున్నట్లు తెలుస్తోంది. 2020లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తడప్ అనే టైటిల్ ని సెట్ చేయాలనీ అనుకుంటున్నారు.  

click me!