12-12-12: RRR నుంచి మరో అప్డేట్!

By Prashanth MFirst Published Nov 30, 2018, 2:49 PM IST
Highlights

టాలీవుడ్ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ RRR షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. మూవీ లాంచ్ ఈవెంట్ కోసం 11-11-11 ఉదయం 11 గంటలకు అనే మ్యాజిక్ డేట్ సెట్ చేసుకొని అందరూ మాట్లాడుకునేలా చేసిన జక్కన్న నెక్స్ట్ మరో మ్యాజిక్ డేట్ తో గుడ్ న్యూస్ ను అందించనున్నాడు. 

సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎక్కువగా హీరోయిన్స్ ఎవరనే విషయంపైనే రూమర్స్ వస్తున్నాయి. కీర్తి సురేష్ సెట్టయిందని టాక్ గట్టిగా వచ్చింది. అయితే చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే 12-12-12 వ తేదీ నాడు 12 గంటలకు హీరోయిన్స్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మొదటి షెడ్యూల్ ని డిసెంబర్ 3వ తేదీకి ఎండ్ చేసి మొత్తంగా ముగ్గురి హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసి కొత్త ఏడాదిలో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు టాక్. రామ్ చరణ్ - ఎన్టీఆర్ పోలీస్ దొంగలుగా కనిపించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. మరి రాజమౌళి వారిని ఏ విధంగా తెరపై ప్రజెంట్ చేస్తాడో చూడాలి. 

click me!