NSA అజిత్ దోవల్ బయోపిక్.. అక్షయ్ కుమార్ సిద్దమేనా?

Published : Aug 06, 2019, 04:18 PM IST
NSA అజిత్ దోవల్ బయోపిక్.. అక్షయ్ కుమార్ సిద్దమేనా?

సారాంశం

రీసెంట్ గా అక్షయ్ వద్దకు మరో ప్రాజెక్ట్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. భారత జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిత్ దోవల్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు నీరజ్ పాండే ప్రయత్నాలు చేస్తున్నాడు.

బాలీవుడ్ లో ఈ మధ్య నిజజీవితలకు సంబందించిన కథలు నెలకోకటి వస్తున్నాయి. అయితే అక్షయ్ కుమార్ ఎక్కువగా అలాంటి ప్రయోగాలతో అభిమానులను ఆకర్షిస్తున్నాడు. కుదిరితే చారిత్రత్మక కథలు లేకుంటే ప్రముఖుల బయోపిక్ లు అంటూ తనదైన శైలిలో సందేశాత్మక ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాడు. 

మరికొన్ని రోజుల్లో అక్షయ్ నుంచి మిషన్ మంగళ్ యాన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో నాలుగు ప్రాజెక్టులు పెండింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఇక రీసెంట్ గా అక్షయ్ వద్దకు మరో ప్రాజెక్ట్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. భారత జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిత్ దోవల్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు నీరజ్ పాండే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆ సినిమాలో అక్షయ్ అజిత్ దోవల్ గా కనిపించే అవకాశం ఉందని బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.  

సర్జికల్ స్ట్రైక్ నుంచి ఇటీవల ఆర్టికల్ 370 వంటి విషయాల్లో అజిత్ దోవల్ పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా రక్షణ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అందుకు గాను సైనిక విభాగంలో కీర్తి చక్ర అవార్డు కూడా దక్కింది. అలాంటి ప్రముఖ వ్యక్తి కథ జనాలకు తెలియాలని, ఆ కథలో అక్షయ్ నటిస్తేనే బావుంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై అక్షయ్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి మరి.  

PREV
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి