నాని ప్రయోగం.. దర్శకుడికి కూడా కొత్తదే!

By Prashanth MFirst Published Jan 8, 2019, 6:16 PM IST
Highlights

డబుల్ హ్యాట్రిక్స్ తో 2017 వరకు మంచి హిట్స్ అందుకొని మార్కెట్ పెంచుకున్న న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్స్ అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ గా నిలువగా ఆ తరువాత నాగ్ తో చేసిన దేవదాస్ సినిమా కూడా కలిసిరాలేదు. 

డబుల్ హ్యాట్రిక్స్ తో 2017 వరకు మంచి హిట్స్ అందుకొని మార్కెట్ పెంచుకున్న న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్స్ అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ గా నిలువగా ఆ తరువాత నాగ్ తో చేసిన దేవదాస్ సినిమా కూడా కలిసిరాలేదు. ఇక ఇప్పుడు ఒక కొత్త టెక్నీక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 

నెక్స్ట్ నాని నుంచి జెర్సీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. క్రికెట్ - లవ్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఆ సినిమా కాకుండా నాని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. సిద్దార్థ్ ఆ సినిమాలో విలన్ గా నటిస్తుండగా నానితో నలుగురు హీరోయిన్స్ నటించనున్నట్లు టాక్ వస్తోంది. అసలు విషయంలోకి వస్తే ఆ సినిమాలో నాని 2 డిఫరెంట్ షేడ్స్ తో చేసే యాక్టింగ్ ఆకట్టుకుంటుందని సమాచారం. 

ఓ వైపు కామెడీతో నవ్విస్తూనే మరోవైపు నరాలు తెగేంతెలా థ్రిల్లర్ అంశాలతో దర్శకుడు సీరియస్ మూడ్ లోకి తీసుకెళతాడట. విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే మెయిన్ హైలెట్ అని తెలుస్తోంది. గతంలో 13బి సినిమాతో ఈ దర్శకుడు స్క్రీన్ ప్లేతో ఎంతగా ఆసక్తిని రేపాడో తెలిసిందే. ఇక చాలా రోజుల తరువాత థ్రిల్లర్ కాన్సెప్ట్ ను టచ్ చేసి దానికి కామెడీ అంశాలను యాడ్ చేశాడట. ఈ కాన్సెప్ట్ దర్శకుడికి నానికి కొత్తది. మొదటి సారి చేస్తోన్న ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి

click me!