నిర్మాతకు షాకిచ్చిన వర్మ.. లక్ష్మిస్ ఎన్టీఆర్ కు హైకోర్టు నోటీసులు!

By Prashanth MFirst Published 23, Jan 2019, 7:04 PM IST
Highlights

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకు మరోసారి చట్టపరమైన అడ్డంకులు ఎదురుకాబోతున్నాయి. చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి హైకోర్టు నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకు మరోసారి చట్టపరమైన అడ్డంకులు ఎదురుకాబోతున్నాయి. చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి హైకోర్టు నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఈ సినిమా నిర్మాతపై కేసు వేశారు. ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబును కించపరిచేలా సినిమాను నిర్మించినట్లు పిఠాపురం వర్మ తెలిపారు. 

అయితే ఎలాంటి అడ్డంకులు ఎదురైనా న్యాయపరంగా ఎదుర్కొంటాం అని లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు ఆయన గురించి అందరికి తెలియాలని ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాట్లు చెబుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అందులో ఒక ఘట్టమని అన్నారు. ఇక సినిమాలో ఎవరిని తప్పుగా చూపించలేదని ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలను తెరమీద చూపించనున్నట్లు వివరించారు. 

అదే విధంగా ఎన్నికలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని చట్టపరంగా తాము కూడా ముందుకు సాగుతామని రాకేష్ రెడ్డి తెలిపారు. ఇక సినిమా టీజర్ ను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసి సినిమాను వరల్డ్ వైడ్ గా మార్చ్ లో విడుదల చేయనున్నట్లు రాకేష్ తెలియజేశారు. 

Last Updated 23, Jan 2019, 7:04 PM IST