లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మరో షాకిచ్చిన ఏపీ హైకోర్ట్

Published : Apr 03, 2019, 05:09 PM ISTUpdated : Apr 03, 2019, 05:25 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మరో షాకిచ్చిన ఏపీ హైకోర్ట్

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం ఈ సినిమా రిలీజ్ కాకుండా హైకోర్టు స్టే ఇచ్చింది.

ఏప్రిల్ 3న సినిమా చూసి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు చెప్పారు. ఈ క్రమంలో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీంతో విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా తాము తీర్పు చెప్పలేమని, సినిమా ప్రివ్యూ కూడా చూడలేమని న్యాయమూర్తులు కేసుని ఏప్రిల్ 9కి వాయిదా వేశారు.

ఈరోజు సినిమా రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం వ్యక్తమవుతుందని భావించిన చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డికి చుక్కెదురైంది. దీంతో రిలీజ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోపక్క సినిమా విడుదల కాకపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టులో కేసు వేయడానికి సిద్ధమవుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Mukesh: హౌస్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, చిన్నదోవైపు పెద్దదోవైపు..ఆ ముగ్గురిపై ముకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
Kareena Kapoor: మాజీ ప్రియుడి భార్యని హోస్ట్ చేసిన కరీనా కపూర్..అభిమానుల ఫన్నీ కామెంట్స్