టైటానిక్ ని ముంచేసిన అవెంజర్స్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

By Prashanth MFirst Published May 6, 2019, 6:44 PM IST
Highlights

అనుకున్నట్టుగానే అవెంజర్స్ ఎండ్ గేమ్ పాత రికార్డులన్నిటిని బద్దలు కొట్టేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అతి తక్కువ కాలంలో ఎక్కువ కలెక్షన్స్ అనుకుంటున్న చిత్రంగా అవెంజర్స్ నిలుస్తోంది. 

అనుకున్నట్టుగానే అవెంజర్స్ ఎండ్ గేమ్ పాత రికార్డులన్నిటిని బద్దలు కొట్టేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అతి తక్కువ కాలంలో ఎక్కువ కలెక్షన్స్ అనుకుంటున్న చిత్రంగా అవెంజర్స్ నిలుస్తోంది. 2 బిలియన్ డాలర్స్ ను అతి వేగంగా అందుకొని 21 ఏళ్ల తరువాత సరికొత్త వరల్డ్ రికార్డ్ ను అందుకుంది.. 

అవతార్ - ఇన్ఫినిటీ వార్ సినిమాల కలెక్షన్స్ ని సైత ఎండ్ గేమ్ బీట్ చేసింది. టైటానికి (1997) అప్పట్లో కొన్నేళ్ల వరకు బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. మొదట్లో 2 బిలియన్ డాలర్స్ అందుకున్న సినిమాగా ఆ సినిమా నిలిచింది. ఆ రికార్డ్ ను అందుకోవడానికి టైటానిక్ కి 5,233 రోజులు పడితే అవెంజర్స్: ఎండ్ గేమ్  కేవలం 11 రోజుల సమయాన్ని మాత్రమే తీసుకుంది. 

అప్పట్లో టికెట్స్ ధరలు చూసుకుంటే టైటనిక్ కలెక్షన్స్ ఒక వండర్. టెక్నాలిజీ ఎంత పెరిగినా విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు ఎన్నొచ్చినా కొన్నేళ్ల వరకు టైటానిక్ చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఇప్పుడు 11 రోజుల్లో 2 బిలియన్ డాలర్స్ ను అందుకొని అవెంజర్స్ ఎండ్ గేమ్ టాప్ లిస్ట్ లోకి చేరిపోయింది. 

2 బిలియన్ డాలర్స్ ను అందుకున్న టాప్ హాలీవుడ్ మూవీస్ (రికార్డును అందుకోవడానికి పట్టిన కాలం)

అవెంజర్స్: ఎండ్ గేమ్ (11రోజుల్లో)

అవతార్ (47రోజుల్లో)

అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్:(48 రోజుల్లో) 

స్టార్ వార్: ఫోర్స్ అవెక్ నెస్(54రోజుల్లో)

టైటానిక్(5,233 రోజుల్లో) 

click me!