మాస్ మహారాజ రవితేజ (RaviTeja) మరో చిత్రం ‘రావణసుర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ (RaviTeja) ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. వరుసగా హిట్లను సైతం సొంతం చేసుకున్నారు. గతేడాది చివర్లో ‘ధమాకా’ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’తోనూ తన ఫ్యాన్స్ ను ఖుషీచేశారు. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తోపాటు బాక్సాపీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. వరుస హిట్లు అందుకుంటున్న రవితేజ తన నెక్ట్స్ సినిమాలను కూడా అదే స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రవితేజ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో నెక్ట్స్ రిలీజ్ కు సిద్ధమవుతున్న చిత్రం ‘రావణసుర’ (Ravanasura). చిత్రానికి ‘స్వామి రారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ, అభిషేక్ నామా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
ఇలా వరుస అప్డేట్స్ అందిస్తున్న మేకర్స్.. తాజాగా మరో క్రేజీ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ‘రావణసుర’నుంచి మరో అప్డేట్ రాబోతుందని కొద్ది సేపటి కింద తెలిపారు. రేపు (ఫిబ్రవరి 28) ఉదయం 10 : 08 నిమిషాలకు అప్డేట్ రానుందని టైమ్ కూడా ఫిక్స్ చేశారు. లాస్ట్ టైమ్ ఇంటెన్సివ్ గ్లింప్స్ విడుదల చేయగా.. ఈ సారి ఏదైనా సాంగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండటంతో వారికి సంబంధించిన అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక చూడాలి మరీ రేపటి అప్డేట్ ఎంటనేది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. చిత్రంలో సుశాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజితా పొన్నాడ ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు.
Update Tomorrow 10.08 a.m stay tuned ❤️❤️❤️
— ABHISHEK PICTURES (@AbhishekPicture)