తన ఫ్యామిలీకి మరో పెద్ద షాక్‌ ఇచ్చిన లాస్య.. ఏంటో తెలుసా?

Published : Nov 13, 2020, 06:26 PM IST
తన ఫ్యామిలీకి మరో పెద్ద షాక్‌ ఇచ్చిన లాస్య.. ఏంటో తెలుసా?

సారాంశం

లాస్య షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తుంది. తాను చేసుకున్న భర్త మంజునాథ్‌ గురించి సీక్రెట్స్ వెల్లడిస్తూ వారి ఫ్యామిలీకి షాక్‌ ఇస్తుంది. గతంలో తాను అబార్షన్‌ చేసుకున్నానని తెలిపి ఇంట్లో వారి గుండెల్లో రాయి పడ్డంత పనిచేసింది.

లాస్య షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తుంది. తాను చేసుకున్న భర్త మంజునాథ్‌ గురించి సీక్రెట్స్ వెల్లడిస్తూ వారి ఫ్యామిలీకి షాక్‌ ఇస్తుంది. గతంలో తాను అబార్షన్‌ చేసుకున్నానని తెలిపి ఇంట్లో వారి గుండెల్లో రాయి పడ్డంత పనిచేసింది. ఇప్పుడు మరో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. గురువారం ఎపిసోడ్‌లో మరో సీక్రెట్‌ రివీల్‌ చేసింది. బిగ్‌బాస్‌ టాస్క్ మేరకు, తమకి వచ్చిన సందేశాలను తీసుకోవడానికి ముందు ఎవరికి చెప్పని సీక్రెట్స్ చెప్పాలని సభ్యులకు కండీషన్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. 

అందరు తమ సీక్రెట్స్ వెల్లడించారు. లాస్య తన భర్త గురించి మరో షాక్‌ ఇచ్చింది 2012లో లాస్య, మంజునాథ్‌ ప్రేమ పెళ్లి చేసుకుంటే, 2017లో పెద్దలు కుదిర్చిన మ్యారేజ్‌ చేసున్నామని తెలిపింది. `పెళ్లైనప్పుడు నేను ఒక మరాఠీ కుర్రాడిని పెళ్ళి చేసుకున్నానని చెప్పాను. అయితే అతను చాలా కోటీశ్వరుడు, డబ్బున్న అబ్బాయి అనుకున్నారు. కానీ తను మిడిల్‌ క్లాస్‌ కూడా కాదు. అతని ఆర్థిక పరిస్థితి ఏంటనేది నాకు మాత్రమే తెలుసు` అని చెప్పింది. 

ఇంకా చెబుతూ, మరో పెద్ద షాక్‌ ఇచ్చింది. `తను నాకంటే ఒక ఏడాది చిన్న. ఆ విషయం తెలిసాక నేను కూడా చాలా బాధపడ్డాను. నేను నాకంటే ఏడాది చిన్న వాడిని లవ్‌ చేశానా? అని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఈ సీక్రెట్‌ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఈ షోకి వచ్చాక షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నా.. అమ్మా మీ అల్లుడు నా కంటే ఏడాది చిన్న.. కానీ ఆయనది చాలా పెద్ద మనసు. బాగా చూసుకుంటాడు` అని తెలిపి కన్నీళ్లు పెట్టించింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్