
బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ లాస్య మరోసారి తల్లి అయ్యింది. ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. మరోసారి కూడా ఆమెకి కుమారుడు జన్మించాడు. మంగళవారం తమకి కుమారుడు పుట్టినట్టు వెల్లడించింది లాస్య. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తమ జీవితంలో కొత్త ప్రేమని కలుసుకున్నాం` అని పేర్కొంది లాస్య. మార్చి 7న తమకు కుమారుడి పుట్టినట్టు వెల్లడించింది.
అయితే ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ చిన్న వీడియోని పంచుకుంది లాస్య. ఇందులో తన భర్త మంజునాథ్ చేతులు ఓపెన్ చేసి `ఇట్స్ ఏ` అని, లాస్య చేతులు ఓపెన్ చేసి `బేబీ` అని, తన కుమారుడి చేతులు ఓపెన్ చేసి `బాయ్` అని ప్రకటించారు, చివరగా చిన్నారి చేతిని చూపించారు. డిఫరెంట్ కలర్స్ తో ఈ విషయాన్ని వెల్లడించారు. హోలీ స్పెషల్‌గా తమ కుమారుడు జన్మించినట్టు ప్రకటించడం విశేషం.
లాస్య, మంజునాథ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వారి వివాహాన్ని పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో సీక్రెట్‌గానే పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా పేరెంట్స్ కి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పేరెంట్స్ ని ఒప్పించి మళ్లీ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి కుమారుడు జున్ను జన్మించాడు. గత సీజన్‌లో లాస్య `బిగ్ బాస్` షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె తనదైన ఆటతో అలరించారు. ఇక గతేడాది సెప్టెంబర్‌లో తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించింది లాస్య. ఇప్పుడు పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. చిన్నారి, తల్లి ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తుంది.