
రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ తరువాత ఆయన ఖ్యాతీ దేశమంతా వ్యాపించింది. హాలీవుడ్ లో కూడా మారుమోగింది. పలు ప్రతిష్టాత్మక అవార్డ్ లతో పాటు.. ఎన్నో గౌరవాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి చేరుతున్నాయి. దేశంలోని పలు ప్రతిష్టాత్మకమైన సదస్సులకు కూడా రామ్ చరణ్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి పాల్గొనే గౌరవాన్ని వరుసగా రామ్ చరణ్ దక్కించుకుంటూ వస్తున్నాడు. ఆస్కార్ అందుకోగానే డైరెక్ట్ గా ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకు ఆయన అటు నుంచి అటే లాండ్ అయ్యాడు. ఇక తాజాగా కశ్మీర్లో జరుగుతున్న G20 సదస్సు 2023 లో చరణ్ పాల్గొన్నాడు.
ఈరోజు (మే 22) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జీ20 సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఇందులో ఇండియా తరుపు నుంచి, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే కాశ్మీర్ చేరిన మెగా పవర్ స్టార్.. ఈరోజు జరిగిన కార్యక్రమల్లో చురుక్కా పాల్గొన్నాడు. ఇక ఈ సదస్సులో.. సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్ లతో కలిసి రామ్ చరణ్ సదస్సులో పాల్గొన్నాడు. ఇక ఈ సదస్సులో మంత్రి జితేంద్ర సింగ్ రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అందరు ఆశ్చర్యపడేలా.. మంత్రి కామెంట్స్ చేశారు.
రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడుతూ.. చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనుకుంటా. ఇక్కడికి ప్రజలు వచ్చింది కూడా మమల్నిచూడడానికి కాదు. రామ్ చరణ్ చూడడానికే వచ్చారు అంటూ వ్యాఖ్యానించారు. దాంతో రామ్ చరణ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ.. చేతులెత్తి నమస్కారం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక రామ్ చరణ్ ఈ మూడు రోజులు పాటు శ్రీనగర్ లోనే పర్యటించనున్నారు. జమ్మూ కశ్మీర్ లో జరగనున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అందరు ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాంటి సదస్సులో రామ్ చరణ్ కూడా భాగం కావడంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నారు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాని చేస్తున్న చరణ్.. ఆతరువాత బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడు. ఇక శంకర్ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈసినిమాలో చరణ్ జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.